సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ హిమామ్.
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 08 (ప్రజాబలం)
ఖమ్మం మున్నేరుకి ఇరువైపులా కరకట్టను నిర్మించాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ హిమాం అన్నారు. ఈరోజు 30 డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎర్ర నగేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో సుమారు లక్షన్నర జనాభా నివసించు చున్నారు. మున్నేరుపై ఈ మధ్యనే కేసీఆర్ గారు కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం 1,80 కోట్లను విడుదల చేయడం జరిగింది దానికి పట్టణ ప్రజలందరూ కూడా అలాగే సిపిఎం కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మున్నేరుపై బ్రిడ్జి తో పాటు ఇరువైపులా కరకట్ట నిర్మించాలని కరకట్ట నిర్మించిన తర్వాత పంపిణీల రోడ్డు చివర ట్యాంకు దగ్గర నుండి కాలువ ఒడ్డు ప్రాంతం వరకు మధ్యలో ఆనకట్ట నిర్మించి బోటు షికారు కూడా పెట్టాలని ఆ సందర్భంగా టూరిజం ప్రాంతంగా దాన్ని అభివృద్ధి చేయాలని. కరకట్ట నిర్మించడం వలన చుట్టుపక్కల ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా వర్షాలు కురిసినప్పుడు నీళ్లు రాకుండా ఉంటుందని ఆయన అన్నారు వెంటనే కరకట్ట నిర్మాణం పనులు ప్రారంభించాలని అలాగే మున్నేరు బ్రిడ్జి పనులు కూడా వెంటనే ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం 3 టౌన్ నాయకులు రంగు హనుమంతచారి, పెద్దోజు ఉపేంద్ర చారి, మద్ది శ్రీను, పొదిళ్ల రాఘవయ్య, షేక్ కులసనా బేగం తదితరులు పాల్గొన్నారు