దళితులపై ఆధిపత్య కులాల దాడులు నశించాలి

 

ఎస్సీ , ఎస్టీ , బిసి మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన.

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 08 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో బుధవారం జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ , ఎస్టీ , బిసి మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళితులపై ఆధిపత్య కులాల దాడులు నశించాలి అని నిరసన తెలియజేశారు . అనంతరం ఐక్యవేదిక చైర్మన్ మరియు కన్వీనర్లు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆధిపత్య కులాలు చేస్తున్నటువంటి దాడులు దాడిని నిత్య కృత్యమైనవి మొన్న న్యాయవాద దంపతులపై జరిగిన దాడి మరువకముందే నిన్న సమత అనే ప్రభుత్వ ఉద్యోగిని మానసిక వేధింపులకు గురిచేసి ఆత్మహత్య ప్రయత్నానికి పూరి కొలిపిన వైనం వెలుగులోకి వచ్చిందని . నేడు రేపు ఏమి జరుగునో ఏమేమి జరుగునో అని అన్నారు . అణగారిన వర్గాలు ఆందోళనలో జీవితాన్ని వెల్లదీస్తున్నారు . ఈ దాడులపై ఇకనైనా జిల్లా పరిపాలన యంత్రాంగం దృష్టిసారించి నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు . మరొక సంఘటన భవిష్యత్తులో జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు , కన్వీనర్ గుంతెటి వీరభద్రం మరియు నాయకులు అబ్దుల్ రహమాన్ , పద్మాచారి , బద్రునాయక్ , పెరుగు వెంకటరమణ , ఆర్పీఎఫ్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ నకరికంటే సంజీవరావు , మాల మహానాడు నాయకులు కట్టే సుధాకర్ , దాసరి శ్రీనివాస్ , ఆందోని , ముప్ప మంగయ్య , తోగర రమేష్ , జంగిపల్లి రవి , ఉపేంద్ర నాయక్ , రమ్య , రావుల వెంకట్ , అఖిల్ , రావుల వెంకటేశ్వర్లు , షేక్ మస్తాన్ , దొడ్డ శ్రీనివాస్ రెడ్డి , ప్రణయ్ , వీరన్న నాయక్ , మెట్ట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking