మెదక్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్, ఫిబ్రవరి 8, 2023
ప్రజా బలం న్యూస్ :-
ధరణి పోర్టల్ లో టెక్నికల్ మాడ్యూల్ కు సంబంధించి సమస్యలను పరిష్కరించుటకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సద్వినియోగం చేసుకోవలసిందిగా అదనపు కలెక్టర్ రమేష్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. టెక్నికల్ మాడ్యూల్ 33 లో పేర్కొన్న పేరు మార్పు, భూమి స్వభావం, భూమి వర్గీకరణ, భూమి రకం మార్పు, పరిధి దిద్దుబాటు, మిస్సింగ్ అయిన సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్ సరిచేయుట, అన్ని రకాల నేషనల్ ఖాటా నుండి పట్టాకు భూమిని బదిలీ చేయుట, నాలా నుండి వ్యవసాయానికి మార్చుట, ధరణి కంటే ముందే గజాలలోఅమ్మిన కొంత భూమి వివరాలకు సంబంధించి ధరణిలో సరిచేసుకోవచ్చని అన్నారు. అలాగే టెక్నికల్ మాడ్యూల్ 15 లో పొందుపరచిన మ్యుటేషన్, వారసత్వ, అసైన్గ్డ్ భూముల వివరాలు, పాస్ బుక్ తో నిమిత్తం లేకుండా నాలా కు సంబంధించిన దరఖాస్తులు పరిశీలిస్తారని ఆయన తెలిపారు. అంతేగాక తండ్రి లేదా భర్త పేరు తప్పున్నా, ఆధార్ తప్పున్నా, లింగ బేధం ఉన్నా, తదితర సమస్యలకు సంబంధించి కార్యాలయ పనివేళల్లో ధరణి హెల్ప్ డెస్క్ ద్వారా టెక్నికల్ సిబ్బందికి దరఖాస్తు ఇచ్చి సమస్యలు పరిష్కరించుకోవలసినదిగా ఆయన సూచించారు.