జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా.టి.రఘునాథస్వామి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 19:
ఎన్నాళ్ళయినా ఎన్నేళ్లయినా చెరిగిపోని బంధం అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అంతటి గొప్ప అనుబంధానికి ప్రతీక మన రాఖీ పండుగ.
రాఖీ పండుగను పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని,
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా అధికారి డా టి రఘునాథస్వామి గారికి
ఆహ్ కార్యాలయ మహిళా అధికారులు మరియు ఉద్యోగులు ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డా టి రఘునాథస్వామి మాట్లాడుతూ తనపై అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక అని, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
జిల్లా లోని ఉద్యోగులు, ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల ఆరోగ్యం , భద్రత మరియు శ్రేయస్సు,
కోసం తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని అన్నారు.