మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం -మెదక్ జిల్లా ప్రతినిధి,
19 ఆగస్టు 2024 :
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెదక్ బాలసదనం బాలికలు సుమారు 16 మంది జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి రాఖీ కట్టారు
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ సోదర భావానికి ప్రతీకగా ప్రతియేటా జరుపుకునే రక్షా బంధన్ (రాఖీ పండుగ) అని అన్నారు రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ రాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ రాఖీ పండగను సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు కలెక్టర్ . తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం ఈ పండుగ విశిష్టత అని గుర్తు చేశారు.
అక్కా, చెల్లెళ్ళ రక్ష తమ గురుతర బాధ్యత అని రక్షాబంధన్ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందన్నారు. సోదరభావంతో, ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి నాడు రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే ఈ వేడుక భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటుతుందన్నారు. రాఖీ పౌర్ణమి వేడుక ప్రజల మధ్య ఆత్మీయతను మరింతగా పెంపొందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి, బ్రహ్మాజీ, డిసిపిఓ కరుణ, గంగాధర్, చైల్డ్ హెల్ప్ లైన్, భరత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు