ప్రజావాణిలో 63 దరఖాస్తులు స్వీకరణ
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం -మెదక్ జిల్లా ప్రతినిధి
19 ఆగస్టు 2024:
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదీదారులతో మమేకమై వారి సమస్యలను సావధానంగా పరిశీలించి పరిష్కార దిశగా కృషి చేయాలని, నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. పరిష్కరించుటకు వీలులేని పక్షంలో తదుపరి చర్యల కోసం వారికి అర్ధమయ్యే విధంగా సూచనలు అందించాలన్నారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 63 విజ్ఞప్తులను స్వీకరించారు. అందులో రుణమాఫీ-22 ,
ధరణి -19, పింఛన్- 4 , ఇతర సమస్యలు-22, మొత్తం -63 దరఖాస్తు వచ్చాయి.
ఈ ప్రజావాణి లో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.