– D.I.Y HEALTH పేరుతో సరికొత్త బీమా పాలసీని ప్రారంభించిన ఫ్యూచర్ జెనరాలి ఇండియా
– సమగ్రమైన బేస్ ప్లాన్‌తో పాటు 20 మాడ్యులర్ ఫీచర్లు
హైదరాబాద్; జూన్ 2, 2023: పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకొనే సరికొత్త అవకాశాన్ని కల్పిస్తూ దేశంలోనే ప్రముఖ ప్రైవేట్ జనరల్ బీమా సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్ జెనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సరికొత్త పాలసీని ప్రవేశపెట్టింది. D.I.Y HEALTH పేరుతో ప్రవేశపెట్టిన ఈ పాలసీ ద్వారా కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకోవచ్చని సంస్థ గురువారం ప్రకటించింది. 17 బేస్ ఫీచర్‌లతో బేస్ ప్లాన్‌ను అందిస్తోంది, అలాగే 20 మాడ్యులర్ ఫీచర్‌లతో విస్తృత శ్రేణిని కలిగి ఉంటుంది.
D.I.Y హెల్త్‌లోని ముఖ్యమైన అంశాలు:
– క్రమ వాయిదాలలో చెల్లించిన సంచిత బోనస్ బూస్టర్- బీమా మొత్తం 600 శాతానికి పెరుగుతుంది
– ప్రమాదాలు & అత్యవసర అనారోగ్య పరిస్థితులలో బూస్టర్
– వైద్యేతర & వినియోగించదగిన ఖర్చులు
– వ్యక్తిగత ప్రమాదం కవరేజీ
– బీమా మొత్తానికి సమగ్ర OPD కవర్. 5 లక్షలు & అంతకంటే ఎక్కువ
– స్క్రీనింగ్ మరియు టీకా
– గరిష్టంగా 15 మంది కుటుంబ సభ్యులకు కవరేజీ
– ఐచ్ఛిక కవర్లలో ప్రసూతి, ప్రసవానంతర, అంబులెన్స్ (ఎయిర్/రోడ్డు), క్రిటికల్ ఇల్నెస్ బూస్టర్, స్వస్థత ప్రయోజనం, ప్రమాదవశాత్తు మరణం కవరేజీ మొదలైనవి ఐచ్ఛిక కవరేజీలో ఉంటాయి.
*షరతులు వర్తిస్తాయి.
మీ అవసరాలకు అనుగుణంగా బీమా : అనూప్ రౌ
ప్రజల ఎంపిక శక్తిని పెంచే ఈ పాలసీ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్యూచర్ జెనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈవో అనూప్ రౌ మాట్లాడుతూ.. మా విప్లవాత్మక D.I.Y HEALTH పథకాన్ని ప్రారంభించడం ద్వారా సంస్కరణాత్మక ప్రయాణాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ విప్లవాత్మక పథకం తమ వినియోగదారులకు ఎంపిక శక్తిని అందించడానికి రూపొందించబడిందని వివరించారు. ఇది వ్యక్తులకు వారి సొంత కవరేజీని రూపొందించడానికి, నియంత్రణ, సౌలభ్యం మరియు అనుకూలీకరణ పొందే అధికారం ఇస్తుందన్నారు. బీమా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండే భవిష్యత్తుకు స్వాగతం అని సగర్వంగా పిలుపునిచ్చారు.
పథకం సమగ్ర వివరాలను వెల్లడించిన అనుప్ రౌ..”D.I.Y HEALTH అనేది అత్యంత సమగ్రమైన మాడ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. ఇది వినియోగదారులు వారి జీవిత అవసరాలకు అనుగుణంగా అత్యంత ఆవశ్యకమైన ఫీచర్‌లను ఎంచుకోవడమే కాకుండా, ఏటా పాలసీలను మరింత సర్దుబాటు చేయడానికి లేదా సవరించడానికి వీలు కల్పిస్తుంది. వారి ఆరోగ్య బీమా ప్రత్యేకంగా ఉండేలా చూస్తుంది” అని అన్నారు.
2023 యొక్క అత్యంత ముఖ్యమైన ఆఫర్‌లలో ఒకటిగా కొత్త పాలసీపై అవగాహన, నమోదు కోసం FGII ఆన్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్‌లు మరియు పంపిణీదారుల కోసం చర్యలు తీసుకుంటోంది. ఈ పథకానికి సంబంధించి వివిధ మాధ్యమాలపై ప్రకటనలు మరియు మార్కెటింగ్ ప్రచారాన్ని త్వరలో ఆవిష్కరించాలని సంస్థ భావిస్తోంది.
ఇటీవల కాలంలో వినూత్నమైన పథకాలతో, వినియోగదారుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న FGII మార్కెట్‌లో తన హవాను కొనసాగిస్తోంది. FGII వినియోగదారుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని పొంది, దాని వినూత్న మరియు సముచిత పాలసీల విజయాన్ని కొనసాగిస్తోంది. పాలసీ కస్టమైజేషన్‌ను ఒక క్లిష్ట అంశంగా భావించే వినియోగదారులు దానికొసం అదనపు వ్యయాన్ని కూడా వెచ్చించేందుకు సంకుచించడం లేదని Unomer ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలసింది. ఈ అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని వినియోగదారులకు ఎంపిక శక్తి అని అందిస్తూ వారికి అవసరమైన కవరేజీని ఎంపిక చేసుకొనే అధికారం ఇచ్చేలా ఈ సరికొత్త పాలనీకి శ్రీకారం చుట్టింది.
FG డాగ్ హెల్త్ కవర్, FG హెల్త్ అబ్సొల్యూట్‌తో పాటుగా LGBTQIA+ కమ్యూనిటీ సభ్యులను చేర్చడానికి ‘కుటుంబం’ నిర్వచనాన్నిప్రారంభించడంతో సహా – వినియోగదారుల ప్రతిపాదనలను ముందంజలోకి తీసుకువచ్చే వినూత్న పథకాల వరుసలో మరో ఈ కొత్త పథకాన్ని సంస్థ ప్రారంభించింది.
GII #MYCHOICE సర్వేలోని ముఖ్య అన్వేషణలు:
అవగాహన అనేది ఒక ఎంపిక:
– 94% మంది ప్రజలు వారి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడానికి లేదా పునరుద్ధరించడానికి ముందు వారి స్వంత పరిశోధనను నిర్వహిస్తారు.
– 2/3వ వంతు మంది ఫీచర్‌లను పోల్చడం కోసం ఆన్‌లైన్ పోర్టల్‌లను సూచిస్తారు. అయితే ఇద్దరిలో ఒకరు సంబంధిత ఉద్దేశించిన ప్రొవైడర్ మరియు ప్లాన్‌ని ఎంచుకోవడానికి ముందు కుటుంబం, స్నేహితులు మరియు సహచరుల నుండి సలహాలను తీసుకుంటున్నారు.
– నలుగురిలో ఒకరు మాత్రమే కొనుగోలు లేదా పునరుద్ధరణ కోసం బీమా ఏజెంట్లు మరియు మధ్యవర్తులను సంప్రదించగలుగుతున్నారు.
ఎంపిక అనేది మంచిది:
– 94% మంది ప్రజలు వీలైతే వారి ఆరోగ్య బీమా పాలసీలను తమ అవసరాలకు అనుగుణంగా రూపొందించడాన్ని ఇష్టపడుతున్నారు.
– కస్టమైజేషన్‌ను కోరుకుంటున్న 10 మందిలోని 8 మంది తమ అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను చేర్చాల్సిన అవసరాన్ని కొక్కిచెప్పారు.
– పాలసీ కస్టమైజేషన్ కోరుతున్న ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రస్తుత వారి పాలసీలో అందించిన చాలా ఫీచర్లను ఉపయోగించలేదని వెల్లడించారు.
ఎంపీక అనేది ఒక ఫీచర్:
– ఆరోగ్య బీమా కస్టమైజేషన్ కోసం చూస్తున్న 10 మందిలో 8 మంది వినియోగదారులు అదనపు ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.
– కవరేజీ ఎంపిక శక్తిని వినియోగించుకోవడానికి కస్టమర్‌లు అదనపు మొత్తాన్ని లేదా తమ సమయాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు.
– క్లిష్టంగాలేని, కష్టమైజేషన్ కు వీలుగా తమ అవసరాలకు అనువైన పాలసీలకోసం డిమాండ్ పెరుగుతోంది. మరీముఖ్యంగా రెన్యూవల్ కోరుకొనేవారి నుంచి ఈ డిమాండ్ అధికంగా ఉంది.
ఈ సర్వేలో వివిధ రంగాల్లో పనిచేసే 1500+ మంది పాల్గొన్నారు. ఆరోగ్య బీమా పాలసీ యజమానులు మరియు 25-45 సంవత్సరాల వయస్సు గలవారు, 14 భారతీయ నగరాల్లో (ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణె, అహ్మదాబాద్, లక్నో, కోయంబత్తూర్ జైపూర్, వైజాగ్, నాగ్‌పూర్ & కోట) స్వయం ఉపాధి మరియు వివిధ సంస్థల్లో నెలవారి జీతాలు తీసుకొనేవారు ఈ సర్వేలో పాల్గన్నారు.
ఫ్యూచర్ జెనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గురించి:
ఫ్యూచర్ జెనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, జెనరాలి గ్రూప్, మెజారిటీ 74% వాటాతో, 190+ ఏళ్లు వారసత్వ బీమా వ్యాపారంలో, ఫ్యూచర్ గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్ గా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వ్యక్తులు మరియు కార్పొరేట్‌లకు క్లిష్ట పరిస్థతులను నిర్వహించడంలో మరియు తగ్గించడంలో సహాయపడటానికి రిటైల్, వాణిజ్య, వ్యక్తిగత మరియు గ్రామీణ బీమా పరిష్కారాలను అందించే లక్ష్యంతో 2006లో సంస్థ స్థాపించబడింది. FGII FY 13-14లో కేవలం ఆరు సంవత్సరాల కార్యకలాపాలలో అనేక మైలురాళ్లు సాధించింది.
నేడు FY 2023లో నిర్వహణలో ఉన్న ఆస్తులు 6,748 కోట్లు మరియు గ్రాస్ వ్రిటెన్ ప్రీమియం రూ. 4,627 కోట్ల ఫ్యూచర్ జెనరాలి, భారత బీమా విభాగంలో తన ఉనికిని దృఢంగా స్థాపించింది. ప్రస్తుతం భారతదేశంలోని టాప్ 10 ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో, ప్రతిష్టాత్మకమైన గ్రేట్ ప్లేస్ టు వర్క్® ఇన్‌స్టిట్యూట్ ప్రకారం ఫ్యూచర్ జెనరాలి వరుసగా 4వ సారి (నవంబర్ 2022–నవంబర్ 2023) ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సర్టిఫైడ్ సంస్థగా అవతరించింది. ఇటీవలి కాలంలో కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యుత్తమమైన గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ 2022 మరియు ది ఎకనామిక్ టైమ్స్ బెస్ట్ బ్రాండ్స్ అవార్డ్స్ 2022 అవార్డులను సంస్థ అందుకుంది.
జనరల్ గ్రూప్ గురించి:
జెనరాలి అతిపెద్ద గ్లోబల్ ఇన్సూరెన్స్ మరియు ఆస్తుల నిర్వహణ సంస్థల్లో ఒకటి. ఇది 1831లో స్థాపించబడి 2022లో € 81.5 బిలియన్ల మొత్తం ప్రీమియం ఆదాయంతో ప్రపంచంలోని 50కి పైగా దేశాలలో ఉంది. 82,000 మంది ఉద్యోగులతో 68 మిలియన్ల కస్టమర్లకు సేవలందిస్తోంది. యూరోప్‌లో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్న సంస్థ ఆసియా మరియు లాటిన్ అమెరికాలో క్రమంగా తన ఉనికిని చాటుకుంటోంది.
వినూత్నమైన మరియు వ్యక్తిగత పరిష్కారాలు, అత్యుత్తమ కస్టమర్ అనుభవం మరియు దాని డిజిటలైజ్డ్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సామర్థ్యాల ద్వారా సాధించబడిన కస్టమర్‌లకు జీవితకాల భాగస్వామి నిబద్ధత, జెనరాలి యొక్క వ్యూహంలో ప్రధాన అంశం. సమర్ధవంతమైన మరియు మరింత స్థితిస్థాపకమైన సమాజాన్ని నిర్మించేటప్పుడు వాటాదారులందరికీ విలువను సృష్టించే లక్ష్యంతో.. గ్రూప్ అన్ని వ్యూహాత్మక ఎంపికలలో స్థిరత్వాన్ని పూర్తిగా పొందుపరిచింది.
Unomer గురించి:
Unomer ప్రముఖ మొబైల్ మార్కెట్ పరిశోధన వేదిక. ఇది మొబైల్ యాప్‌ల నెట్‌వర్క్ ద్వారా మిలియన్ల కొద్ది వినియోగదారులను చేరుకుంటుంది మరియు యాప్ సర్వే ద్వరా పరస్పరం వినియోగదారులను సంప్రదించి వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను సేకరిస్తుంది.