గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని మోజంజహి మార్కెట్ మరియు రాంమందిర్ వద్ద గోషామహల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగినది. సోనియాగాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి తెలంగాణా రావాడానికి సోనియాగాంధే కారణమని జై కాంగ్రెస్ జై సోనియాగాంధీ అని నినాదాలు చేసినారు.ఈ సందర్భంగా తెలంగాణా కాంగ్రెస్ పార్టీ స్పోక్స పర్సన్ నరెండర్ రాంశెట్టి మాట్లాడుతూ తెలంగాణా కొరకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టడంలో సోనియాగాంధీ పాత్ర ముఖ్యమైనదని అన్నారు. ఈ రోజు తెలంగాణా రావాడానికి సోనియాగాంధే ముఖ్యమని తెలంగాణా ప్రజలు ఎప్పటికి సోనియాగాంధీని మరువరని అన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు బండ అశోక్ ,సి.కె మూర్తి , కన్నయ లాల్ సాహు,కైలాస్‌సింగ్ ,శ్రీకాంత్ యాదవ్, సంజయ్ యాదవ్,శ్రీదర్‌గౌడ్,ఫిల్‌కానా అశోక్,నిర్మల్ యాదవ్,గోషామహల్,కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మహిళా నాయకురాల్లు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.
