ఖమ్మం ప్రతినిధి మార్చి 31 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని గ్రేయిన్ మార్కెట్ రోడ్ నందు శుక్రవారం ఖమ్మం నగర్ గ్రేయిన్ మార్కెట్ ట్రాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నున్న మాధవరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన యూనియన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ దొరేపల్లి శ్వేత,మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఆర్.జె.సి కృష్ణ..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్మికుల పక్షపాతి వారి బాగోగులు సంక్షేమానికి వెన్నదన్నుగా నిలిచి వెన్నంటే నిలుస్తున్న కుటుంబం పువ్వాడ. ప్రస్తుతం జిల్లాలో కార్మికుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులకు ఆత్మీయులుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరొందారు. కార్మికుల విజ్ఞప్తి మేరకు ఖమ్మం నగరంలోని గ్రాయిన్ మార్కెట్ ట్రాలీ యూనియన్ భవన నిర్మాణం కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఐదు లక్షల రూపాయలు అందజేశారన్నారు.అలాగే ఖమ్మంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ రెన్యువేషన్ కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సహకారంతో మంజూరైన రూ.10 కోట్ల 34 లక్షల రూపాయలతో త్వరలో వ్యవసాయ మార్కెట్ రేనోవేషన్ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలని వ్యవసాయం మార్కెట్ అధికారులను కోరారు. అజయ్ కుమార్ గారి సహకారంతో త్వరలోనే జిల్లాల్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నారు కార్మికులకు వైద్య బీమా,జీవిత బీమా వంటి పథకాలు వర్తింపజేస్తూ కార్పొరేట్ దవాఖానాల్లో చికిత్సలకు మంత్రి పువ్వాడ చోరువచూపుతున్నారు అని తెలియజేశారు.కార్మికులంతా ఐక్యమత్తంగా ఉండి రానున్న రోజుల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
: అనంతరం ముఖ్య అతిథులందరికీ శాలువాలు కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ మల్లేశం కార్మిక విభాగం అధ్యక్షులు కార్యదర్శులు,నాయకులు మాటేటి నాగేశ్వరరావు గీతా వెంకన్న,కనకం భద్రయ్య,ఎర్ర అప్పారావు,వెంకటేశ్వరరావు నరేష్ పత్తిపాక రమేష్ సతీష్ సాది రెడ్డి కార్మిక సంఘం సభ్యులు మరియు హమాలీలు తదితరులు పాల్గొన్నారు