ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 06 :ఉమ్మడి అదిలాబాద్-కరీంనగర్-మెదక్- నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి,టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య విజయం సాధించిన సందర్భంగా అంబేద్కర్,తెలంగాణ తల్లి, మరియు చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించి విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు.బీజేపీ నాయకులు మాట్లాడుతూ… బీజేపీ కి ఓటు వేసి గెలిపించిన టీచర్లకు, గ్రాడ్యుయేట్లు అందరికీ కృతజ్ఞతలు తెలియ జేశారు, రాబోయే రోజుల్లో తెలంగాణలో మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారం లోకి వస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు,మండల అధ్యక్షులు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి,సామ వెంకటరమణ, సీనియర్ నాయకులు రమేష్ జైన్,నరేష్ జేన్,తమ్మినేని శ్రీనివాసు,గురువయ్య,కోమాకుల రవి, ముష్కం గంగన్న,బొక్కనపెల్లి సతీష్, మంద రాజేందర్, వేణుగోపాల్,తగరపు గంగయ్య, వేముల మధు,కానగంటి మల్లయ్య,బొప్పు కిషన్,బుద్ధి సిద్ధార్థ, సమరసింహ,బిజెపి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు