రాష్ట్రస్థాయి జిజ్ఞాస ప్రదర్శనలో లక్షెట్టిపేట డిగ్రీ విద్యార్థులు

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 06 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట కళాశాల విద్యా కమీషనర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు పరిశోధన విలువలు పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ లో భాగంగా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన తెలుగు,గణితం విభాగాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గోన్నారు.తెలుగు ప్రాజెక్ట్ కి అధ్యాపకుడు డాక్టర్ తన్నీరు సురేష్ గణిత ప్రాజెక్ట్ కు అద్యాపకురాలు స్వప్న సూపర్ వైజర్లుగా వ్యవహరించగా విద్యార్థులు,శైలజ,విజయ్,తిరుపతమ్మ, లక్ష్మి, శ్రీనివాస్ తెలుగు సాయి,వర్షిణి,రజని,లక్ష్మి, శ్రీనాథ్ లు గణితం ప్రాజెక్టులను ప్రజెంటేషన్ చేసారు.హైదారాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలుగు జిజ్ఞాస పోటీలు బుధవారం గణితం పోటీలు గురువారం నిర్వహించగా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.ప్రాజెక్ట్ లో భాగంగా వారు ఆధునిక సమాజం,మానవ జీవితలో,పరిశోధనలో వస్తున్న మార్పులను పి.పి. టి.ద్వార మోడల్స్ ద్వారా యూనివర్సిటీ నుండి వచ్చిన సెలక్షన్ కమిటీకి వివరించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జాయింట్ డైరెక్టర్ యాదగిరి విద్యార్థుల ప్రతిభను మెచ్చుకొని సర్టిఫికెట్లు ప్రధానం చేసారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ మహాత్మా,జిజ్ఞాస కో ఆర్డనేటర్ జాడి శంకరయ్య, సూపర్ వైజర్ లు డాక్టర్ తన్నీరు సురేష్,స్వప్న,బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking