అన్న ప్రసాద వితరణ

మణికొండ ప్రజాబలం ప్రతినిధి:మణికొండ మున్సిపాల్‌ కౌన్సిల్‌ లోని పంచవటి కాలనీ ప్రాంగణములో ఉన్న రామాలయ తృతీయ వార్సికోత్సవాల శుభ సందర్భంగా శనివారం ఫిబ్రవరి 25 న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు జరిగిన పూజా కార్యక్రమంలో బాగంగా పునః పూజ, హోమం, మహా పూర్ణాహుతి, చక్ర స్నానం, అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది భగవత్‌ కృపకు పాత్రులైన భక్త జనులు శుభ అవసరాన్ని సద్వినియోగ పరుచుకోని ఆ నయనా నంద శ్రీ రాముని మంగళ ప్రద కార్యక్రమాన్ని కన్నులారా తిలకించి, అన్న ప్రసాదమ్‌ గైకొని కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారిలో పంచవటి కాలనీ కార్య వర్గ సభ్యులు రామ సుబ్బా రెడ్డి తదతరులు, భక్త జనులు, ఆల్‌ కాలనీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు సీతారామ్‌ ధూళిపాళ, బీ ఆర్‌ ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ కే. రామకృష్ణా రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బుద్దోల్‌ శ్రీరాములు, కౌన్సిలర్‌ వసంత్‌ రావు, సీనియర్‌ నాయకులు అందె లక్ష్మణ్‌ రావు, లక్ష్మయ్య, రాజేంద్ర ప్రసాద్‌, గంగాధర్‌, శ్రావణ్‌, సందీప్‌, దిలీప్‌, శ్రీకాంత్‌, రాఘవేంద్ర మహిళా నాయకురాలు విజయలక్ష్మీ, ఆదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking