ప్రాణాపాయ స్థితిలో చిన్నారి

 

పదివేల చేయూత నిచ్చిన కాంగ్రెస్ నేత

జగిత్యాల, ఫిబ్రవరి 25: పుట్టుకతోనే ఖరీదైన రోగాలతో పుట్టిన ఓ చిన్నారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఓ కాంగ్రెస్ నేత చలించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చెందిన సంఘటన ఇది. జగిత్యాల జిల్లా బుగ్గారము మండలం సిరికొండ గ్రామానికి చెందిన గజ్జెల నరేష్-రజిత ల కూతురు పుట్టగానే ఊపిరితిత్తులు, గొంతువాపు వంటి వ్యాధులతో సతమతమవుతోంది. చికిత్స కోసం జగిత్యాల లోని నైరుతి ఆసుపత్రిలో చేర్పించారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలుసుకొన్న బుగ్గారం కాంగ్రెస్ మండల అద్యక్షులు వేముల సుభాష్ స్పందించారు. తమవంతుగా పదివేల ఆర్థిక సహాయాన్ని నేరుగా నైరుతి ఆసుపత్రికి వెళ్ళి తల్లిదండ్రులకు అందజేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని దాతల సహకారం చిన్నారి కుటుంబానికి ఎంతో అవసరమని సుభాష్ కోరారు. అలాగే మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించి మెరుగైన వైద్య చికిత్స అందిచేలా కృషిచేయాలని సుభాష్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking