ఖమ్మం ప్రతినిధి జులై 23 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేష న్ ఇలాంటివి చాలా వార్షికోత్సవములు జరుపుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జి తుంబూరి దయాకర్ రెడ్డి అన్నారు.మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ 10 వ వార్షికోత్సవం వేడుకను (టి జే ఏ) జిల్లా అధ్యక్షులు గంగారపు నాగస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దయాకర్ రెడ్డి కేక్ కట్ చేసి టి జే ఏ జిల్లా నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ ను ఒకరికి ఒకరు తినిపించు కున్నారు ఈ కార్యక్రమంలో టి జే ఏ జిల్లా నాయకులు మతి రామకృష్ణ, పాలేపు రాము, కొదుమూరు జనార్దన్, మసన రమేష్, దోమల కిరణ్, లెనిన్ బాబు, ధరావత్ మధు కొల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు