ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
ఇటీవల నిర్మల్ పట్టణం మరియు ఖానాపూర్ ఏరియా లో జరిగిన దొంగతనాలు చైన్ స్నాచింగ్ ల పైన జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఈ రోజు స్వయంగా నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించి వారికి దిశ నిర్దేశాలు చేశారు.
ఈ రోజు23-7-2024 పట్టణం లో జరిగిన చైన్ స్నాచింగ్ బాదితులతో స్వయంగా జరిగిన దొంగతనం గురుంచి అడిగి తెలుసుకోవటం జరిగినది. వారికి దైర్యం చెప్పి చైన్ స్నాచింగ్ దొంగలను పట్టుకోవటానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పంపటం జరిగినది ఈ మూడు బృందాలు డి.ఎస్.పి గంగా రెడ్డి గారి పర్యవేక్షణలో పరిశోధన చేయును,
దొంగతనాలు జరుగకుండా
ప్రతి దొంగతనంపై పూర్తిగా విచారణ చేయాలి,ఆధారాలు సేకరించాలి,మరియు వాస్తవాలను నిర్ధారించాలి. పట్టుకున్న దొంగలను కోర్టు లో ప్రవేశపెట్టి శిక్ష పడేలా చేయాలి. వారు జైల్ నుండి బయటకు వచ్చాక వారి కదళికలను పర్యవేక్షించాలి.
దొంగతనాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి రాత్రిపూట పోలీస్ పట్రోలింగ్ ఎక్కువగా చేయాలి,అర్దరాత్రి మరియు మద్యానం సమయాల్లో ఎక్కువగా పెట్రోలింగ్ చేయాలి. పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం చాలా ముఖ్యం అని అన్నారు. బాధతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పిటిషన్ లకు వెంటనే స్పందించాలి. దొంగతననికి గురయిన సామన్య ప్రజలకు చట్టపరిధిలో ఏవిధంగా న్యాయం చేయగలమో అలోచించి దానికి తగ్గట్లుగానే న్యాయం జరుగుతుంది అని వారికీ నమ్మకం భరోసా కలిగించాలి
సీసీటీవీ కెమెరాలు ప్రధాన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాలి మరియు వాటి పర్యవేక్షణ జరపాలి.ప్రతి వీది లో సీసీటీవీ కెమెరాలు ఉండేలా గల్లీ కమిటీలను ప్రోత్సహించాలి.నేను సైతం”ప్రోగ్రాం లో బాగంగా పౌర భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు,పౌరులు తో. సి సి టి వి కెమెరాలు ఏర్పాటు చేయాలి.
పౌరుల అవగాహన. ప్రజలకు దొంగతనాలు నిరోధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలి. అనుమశపడ వ్యక్తులు కనపడితే డయల్ 100 కి గాని లేదా దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చేలా ప్రజలని ఉత్తేజపర్చాలి.
తక్షణ స్పందన ఎవరైనా దొంగతనాలపై సమాచారం ఇచ్చిన లేదా అనుమానాస్పద వ్యక్తుల గురుంచి సమాచారం వచ్చిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది కి సూచనలు ఇవ్వాలని ఇన్స్పెక్టర్ లకు ఆదేశించారు.
ఇన్ఫార్మర్ వ్యవస్తను బలోపేతం చేసుకోవాలి.పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలతో మంచి సత్ససంబందాలు కలిగి ఉండాలి అప్పుడు సమాచారం వ్యవస్థ పటిష్టం గా ఉంటుంది. దొంగతనాల సమాచారం అందించిన పౌరుల గోప్యత కాపాడుతూ వారు మరిన్ని సమాచారం ఇచ్చేందుకు ముందుకు వచ్చేలా పౌరులను ప్రోత్సహించాలి.
అన్నీ పోలీస్ స్టేషన్ ల పరిదిలో తరచూ దొంగతనాలు జరిగే ప్రాంతాల మాప్ తయారు చేసి,ఆ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి.అట్టి ప్రాంతాల వివరాలు ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బందికి తెలియజేయాలి.
పాత రికార్డులను పరిశీలించి,గతంలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను వారి కార్యకలాపాలను ట్రాక్ చేయడం.పక్క రాష్ట్రాలు మరియు ఇతర రాష్ట్రాల లనుంది వచ్చే వారిని మన బ్లూ కోల్ట్ మరియు పెట్రోల్ కార్ వారిచేత గుర్తించి విచారించటం చేయాలి.
రద్దీగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా కనపడే విదంగా ప్రతి పోలీస్ సిబ్బంది బాద్యతలు నిర్వర్తించాలి.పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తం వాహణాల తనికీలు విరివిగా చేపట్టాలి.దృవ పత్రాలు లేని వాహనాలను తక్షణమే పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి విచారణ చేపట్టాలి.
ఈ కార్యక్రమ లో నిర్మల్ డి.ఎస్.పి గంగా రెడ్డి,పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, క్రైమ్ ఇన్స్పెక్టర్ సురేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.