ప్రసూతి ఆసుపత్రిలో మహిళలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

మంగళవారం పట్టణంలోని జిల్లా ప్రసూతి పిల్లల ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి గర్భిణీలు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గర్భిణీలు బాలింతలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు.మాతా, శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.శస్త్ర చికిత్సలను తగ్గించి, సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు బాలింతలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యులు,సిబ్బంది సమయపాలన పాటించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బోధన ఆసుపత్రి పర్యవేక్షకులు డా. సునీల్ కుమార్, ప్రసూతి ఆసుపత్రి హెచ్ ఓ డి డా.సరోజ, వైద్యులు ప్రదీప్,వాసు, విన్ని, నర్సింగ్ పర్యవేక్షకురాలు ధనలక్ష్మి, కార్యాలయ పర్యవేక్షకుడు నవీన్, నర్సింగ్,తహసీల్దార్ రాజు,అధికారులు రాంబాయియమ్మ, జన,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking