ఘన నివాళులు

ప్రజాబలం
ఈరోజు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్ ఐదవ ఫేస్ వద్ద జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు .

ఈ సంధర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం.. ఎందరో మహోన్నత వ్యక్తుల త్యాగాల ఫలితం. స్వాతంత్ర పోరాటంలో సమిధలుగా మారి.. ప్రస్తుత సమాజానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. అటువంటి వారిలో బాలగంగాధర్‌ తిలక్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌.. ఒకరు ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అంటే, ఇంకొకరు స్వరాజ్య సాధన కోసం జీవితాన్నే త్యాగం చేశారు అని అన్నారు. బాలగంగాధర్ తిలక్‌ తన మాటలతో యువతలో స్ఫూర్తిని రగిలించి, స్వరాజ్య సాధన దిశగా సాధారణ ప్రజలను సైతం ముందుకు నడిపించారు అని అన్నారు.

స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించి, దాన్ని ఎప్పటికైనా సాధించి తీరుతానంటూ శపథం చేసిన ముందుకు సాగిన మహనీయుల్లో ప్రాతఃస్మరణీయుల్లో మొదటి వారు తిలక్‌ అని గుర్తు చేశారు.జాతీయవాదిగా, సామాజికవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి, దేశవ్యాప్తంగా సామాన్యులు సైతం ఆ ఉద్యమంలో పాల్గొనేలా చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking