రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 04 జూలై 2024:
మణికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 98 శాతంతో ఉత్తీర్ణులైన ఏం.మిర్యామికి వీ.ఆర్.4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు ఆదరించి జాగృతి కాలేజ్ నార్సింగిలో ఉన్నత చదువులకు ఫీజు కట్టిన విషయం అందరికి తెలిసిందే, తదుపరి విద్యార్థిని చేసిన కృషి వలన చదువుల తల్లి సరస్వతీ దేవీ కోలువై ఉన్న బాసరలో త్రిబుల్.ఐ.టీ లో సీటు సాధించడం శుభ సూచకం అని రాబోయే సమయంలో ద్విగుణీకృతంగా చదువు కొవాలని మనసార అభినందనలతో కూడిన ఆశీర్వదాలు తెలియజేస్తూ మున్ముందు ఆమెకు ఏ రకమైన సహాయ సహకార లందించడానికి తమ ట్రస్టు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ జెసినారు.