ఓటమి చవి చూడనున్నారిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ !! ప్రముఖ జ్యోతీష పండితులు ఆచార్య రాఘవేంద్ర జోశ్యం

బ్రిటన్ లో అధికారం లేబర్ పార్టీ దె ?
సత్తా సాటనున్న లేబర్ పార్టీ నాయకులు కెయిర్స్టార్మెర్
౩ వ స్థానానికి పరిమితం కానున్న లిబరల్ డెమ్పోక్రాట్స్ పార్టీ

ప్రముఖ రాజకీయ,సినీ జ్యోతీష పండితులు ఆచార్య రాఘవేంద్ర గతం లో చెప్పిన పలు ఫలితాలు నిజమైన సందర్భంలో బ్రిటన్ ఎన్నికల ఫలితాలు గురించి వారు చెప్తున్నజోశ్యం గురించి పలువురు రాజకీయ మేధావులు సైతం ఆశ్చర్య చకితులౌతున్న తరుణం లో వారు చెప్పిన పలు అంశాలు మన పాఠకుల కోసం మీముందుంచే ప్రయత్నం చేస్తున్నాము.

ప్రస్తుతం బ్రిటన్ లో 650 పార్లమెంట్ స్థానాలలో జరగబోతున్న ఎన్నికల గురించి వారు జోశ్యం చెబుతూ ప్రస్తుతం బ్రిటన్ లో ఈ ఎన్నికలలో రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంటర్ రైట్ కన్జర్వేటివ్ పార్టీ,కెయిర్స్టార్మెర్ ప్రాతినిధ్యం వహిస్తున్నసెంటర్ లెఫ్ట్ లేబర్ పార్టీ లతో పాటుగా లిబరల్ డెమ్పోక్రాట్స్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, రిఫార్మ్ యుకె వంటి మరికొన్ని పార్టీ లు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం, సెంటర్ రైట్ కన్జర్వేటివ్ పార్టీ మరియు కెయిర్స్టార్మెర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంటర్ లెఫ్ట్ లేబర్ పార్టీ ల మధ్యనే ఉండబోతుందని, 2010 నుండి అధికారం లో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ తరపున 2022 నుండి మొట్టమొదటి ఏషియన్ సంతతి ప్రధానిగా వ్యవహరిస్తున్న రిషి సునాక్ ఈ ఎన్నికలలో తన ప్రభావం ఏమాత్రం చూపించలేరని,కెయిర్స్టార్మెర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంటర్ లెఫ్ట్ లేబర్ పార్టీ మరో సారి తన సత్తా సాటడం ద్వారా 2019 లో పొందిన ఘోర పరాజయానికి బదులు తీర్చుకుంటూ గొప్ప విజయాన్ని సాధించడం ద్వారా అధికారాన్ని పొందనుందని,అలాగే ౩వ స్థానం కోసం లిబరల్ డెమ్పోక్రాట్స్ పార్టీ,స్కాటిష్ నేషనల్ పార్టీ,రిఫార్మ్ యుకె పార్టీ లు పోటీలు పడినప్పటికీ లిబరల్ డెమ్పోక్రాట్స్ పార్టీ మాత్రమే ఆ స్థానాన్ని పదిలపరుచుకుంటుందని ఈ సందర్భం గా ఆచార్య రాఘవేంద్ర జోశ్యం చెప్పారు

తెలుగు రాష్ట్రాల గురించి ఆచార్య రాఘవేంద్ర జోశ్యం చెబుతూ 39 అసెంబ్లీ స్థానాలను సాధించిన BRS పార్టీ నుండి ఇప్పటికే సుమారు 6 గురు MLA లు కాంగ్రెస్ పార్టీ లో చేరారని సమీప భవిష్యత్తు లో BRS పార్టీ లో కేవలం 4 లేదా 5 గురు యం యల్ ఏ లు మాత్రమే మిగులుతారని,బి ఆర్ యస్ పార్టీ అధినేత కేసీఆర్ తన ప్రాభవం కోల్పోతున్నప్పటికీ తనకి జైలు యోగం మాత్రం ప్రస్తుతానికి లేదని కానీ కేటీఆర్ కి మాత్రం పలుకేసులతో సమస్యలు తప్పవని జైలు యోగ సూచనలు కూడా ఉన్నాయని అయితే కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం ద్వారా సమస్యలను అధిగమించే అవకాశం ఉందని ఆచార్య రాఘవేంద్ర జోశ్యం చెప్పారు.
సియం రేవంత్ రెడ్డి కి తన పార్టీ కి చెందిన కొందరు సీనియర్ నాయకుల నుండి పదవీగండ సూచనలున్నప్పటి కి రానున్న ౩సంవత్సరాలలో వారి పదవికొచ్చిన డోకా ఏమి లేదని,కానీ తూర్పు తెలంగాణా కి చెందిన కొందరు నాయకుల వలన తలనొప్పులు ఉండే అవకాశం ఉందని జోశ్యం చెప్పారు.సీఎంఓ ఆఫీసులో ఆగ్నేయ బాగాన ఉన్న కొన్ని వాస్తు దోషాలను సరిచేసుకోవడం ద్వారా పాలనలో ఉన్న అవంతరాలు తొలగి త్వరిత గతిన కొన్ని పాలసీలను మరియు పనులను అమలుచేయడానికి అవకాశం లభిస్తుందని సూచించారు.
ఈ మధ్యనే ఆంధ్రా లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కూటమి పార్టీల పై కొన్ని ప్రత్యేక అంశాలను ప్రజలలో రేకెత్తించడం ద్వారా ఒత్తిడి పెంచి ముచ్చెమటలు పట్టించడంలో జగన్మోహన్ రెడ్డి సఫలీకృతుడు అవుతాడని,కొందరు భావిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కి ప్రస్తుతానికి జైలుకెల్లే యోగమేమి లేదని ఆచార్య రాఘవేంద్ర జోశ్యం చెప్పారు.
అలాగే టిడిపి సెంట్రల్ పార్టీ ఆఫీస్ పై గతం లో జరిగిన దాడి లో పాల్గొన్న నేరస్థులను గుర్తించే క్రమం లో అధికార పార్టీ వైఖరి కొండను త్రవ్వి ఉడత కోసం వేదికిన చందంగా ఉంటుందని చెప్పారు.వైసిపీ నాయకుడు ఆరవ సత్యం కి జైలు యోగం ఉందని,అయితే వివిధ మాధ్యమాలలో వస్తున్నట్లుగా దేవినేని అవినాష్ కి వచ్చిన ఇబ్బందేమీ ఉండకపోవచ్చని ఆచార్య రాఘవేంద్ర జోశ్యం చెప్పారు

2024 జులై 13 దాటిన తర్వాత ఏర్పడే కొన్ని ప్రత్యేక గ్రహ కూటముల వలన ప్రపంచవ్యాప్తం గా పలు ఊహించని ఉపద్రవాలు ప్రళయం ముంచుకొస్తుందా అన్నట్లుగా మారతాయని గతంలో రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరిగిన విధం గా పలు దేశాలలో యుద్దవాతావరణం నెలకొనడమే కాకుండా కొన్ని దేశాల మధ్య యుద్ధం కూడా నెలల తరబడి సాగే అవకాశం ఉంటుందని,యూరప్ దేశాలలో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరతాయని,అమెరికా తో పాటు యూరప్,పశ్చిమాసిలలో ఆర్ధిక సంక్షోభం పెరుగుతుందని,ఒక అతి పెద్ద దేశం బయో ఆయుధాల తయారీ మరోసారి మొదలు పెట్టె అవకాశం ఉందని,పలు పకృతి వైపరీత్యాలు అనగా సైక్లోన్స్,భారీ తుఫానులు,వరదలు,టోర్నడోలు సంభవించడం వలన అనేక లక్షల మంది నిరాశ్రయులౌతారని,మరెన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని,అంతు తెలియని వ్యాధులు గాలి, లాలాజలం,ద్వారా వ్యాపించే అవకాశం ఉందని,పెద్ద పెద్ద కంపెనీలు వేల సంఖ్యలో తమ తమ ఉద్యోగులకు ఉద్వాసన చెప్పే అవకాశాలున్నాయని,అంతె కాకుండా దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన సునామి, 4 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా ల తాలూకు వంటి చేదు సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని కావున ప్రజలందరు ముందు జాగ్రత్త వహిస్తూ జాగరూకతతో ఉండాలని,ప్రత్యేకించి విమాన, రైలు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని, ఉత్తర భారత దేశంలో వరదలు,లాండ్ స్లైడ్స్ వలన పలువురు కి ప్రాణ నష్టం సంభవించే ఆవకాశం ఉందని,దేశం లో పేరొందిన పలువురు రాజకీయ నాయకులు మరణిస్తారని,తెలుగు పేరున్న నటీమణి ఆకస్మిక మరణం పొందుతారని ప్రముఖ జ్యోతీష పండితులు ఆచార్య రాఘవేంద్ర జోశ్యం చెప్పారు

ఈ మధ్యనే వీరు అమెరికా ఎన్నికల ఫలితాల గురించి భవిష్యవాణి చెబుతూ అమెరికా పీఠం ట్రంప్ దె అని అని చెప్పిన జోశ్యం మన పాఠకులకు విదితమే

Leave A Reply

Your email address will not be published.

Breaking