విద్యార్థి సంఘ నాయకుల పిలుపు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 03 : ఈ నెల జులై 4 న దేశవ్యాప్తంగా జరిగే కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని
ఎన్ ఎస్ యూ ఐ.వి జె ఎస్, పిడీస్ యూ,ఎస్ ఎఫ్ ఐ,ఏ ఐ ఎస్ ఎఫ్,ఆద్వర్యంలో పి డి ఎస్ యు విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు.ఈ బుధవారం సందర్బంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ…కేంద్రంలో లక్షల రూపాయలకు నీట్ పరీక్ష పత్రాలు లీకేజి చేసి 24 లక్షల మంది జీవితాలతో ఎన్.టి.ఏ.ఏజెన్సీ చెలగాటం ఆడిందని దేశవ్యాప్త ఆందోళనలు జరిగిన దేశ ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు. బీజేపీ హయాంలో పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి ఉందన్నారు.ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(నీట్) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మానిటరింగ్ చేయడంలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విద్యార్థులకు సమాధానం చెప్పాలన్నారు.నీట్ నిర్వహణంలో వివాదాలు నిత్యం జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు కోరుతున్నట్లు నీట్ ఎగ్జాం ను రాష్ట్రాల పరిధిలోకి మార్చాలని కోచింగ్ సెంటర్లు పేరుతో కన్సల్టెన్సీల పేరుతో పేపర్ లికేజీలు చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అనుమతులు రద్దు చేసి పేపర్ లీకేజీ కి పాల్పడిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి నిట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా జులై 4 న జరిగే దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ కు ప్రైవేట్ యాజమాన్యాలు,విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శ్ వర్ధన్, శివ,వెంకటేష్,పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు రెడ్డి చరణ్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి అభినవ్,ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ బి.అభిరామ్, కో-కన్వీనర్ సిద్దార్థ,వైజెఎస్ జిల్లా అధ్యక్షులు సిరాజ్,పి ఎల్ వై జిల్లా కార్యదర్శి మనోహర్, ఏఐవైఎఫ్ మొగిలి లక్ష్మణ్,రవి, తదితరులు పాల్గొన్నారు.