ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 30 : వరి,పత్తి పంటలో తెగులు నివారణ చర్యలపై మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి రైతులకు పలు చూచనాల తెలుపారు. శనివారం ఈ సందర్భంగా ఏఓ ప్రభాకర్ మాట్లాడుతూ…లక్షెట్టిపేట మండలం లో సాగు చేస్తున్న వరి పంట ఎక్కువగా చిరుపొట్ట దశ నుండి ఈనిక దశలో ఉంది.వరి పంట క్షేత్ర సందర్శనల సమాచారం మేరక వరి పంటలో ప్రస్తుతం బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు,కాండం తొలిచే పురుగు,ఆకు చుట్టూ పురుగు ఆశిస్తున్నాయి.అలాగే పత్తి లో రసం పీల్చే పురుగులు, సూక్ష్మ పోషకాలు లోపం కనిపిస్తుంది కావున చీడ పీడ ల యాజమాన్యంపై రైతులు శ్రద్ద వహించాలి.బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు:ప్రస్తుతం బాక్టీరియా ఆకు ఎండు తెగులు అధికంగా వ్యాపిస్తుంది. బాక్టీరియా ఆకు ఎండు తెగులు వరి పైరు దుబ్బు పోసుకునే దశ నుండి గింజ పాలు పోసుకునే దశ వరకు ఆశించే అవకాశం ఉంది.ఈ తెగులు ఆశించ డానికి మన ప్రాంతం లో ఉన్న వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసం లోనే ఈ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది.ఈ తెగులు ఎక్కువగా ఆశించడానికి ప్రధాన కారణాలు ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలు, మంచు కురవడం,అధిక వేగం తో గాలులు వీచడం వలన ఈ తెగులు అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అలాగే నత్రజని ఎరువులు అధికంగా వాడడం వలన ఈ తెగులు అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.ఈ తెగులు చెట్టు నీడ న మొదలయి పొలం అంత వ్యాపిస్తుంది.ఈ తెగులు లక్షణాలు చూసినట్లయితే కులపైన పసుపు రంగు మచ్చలేర్పడి వీటి చుట్టూ డాగు మచ్చలుగా మొదలై అంచుల వెంబడి అలల మాదిరిగా పైనుండి క్రమేపి మట్టల వరకు వ్యాపిస్తాయి.పసుపు పచ్చని జిగురువంటి బ్యాక్టీరియా ఎండ వేడిమికి గట్టిపడి చిన్న,చిన్న వుండలుగా ఏర్పడతాయి.ప్రస్తుతానికి నివారణకు మందులు లేవు.తెగులు 5 శాతం కంటే ఎక్కువైతే నత్రజని వేయడం తాత్కాలికంగా నిలుపు చేయాలి.తెగులు ఆశించిన పొలం నుండి ఆశించని పొలం నకు నీరు పారకుండ చూడాలి.నీటిని ఒకటి రెండుసార్లు పూర్తిగా బయటికి మురుగు నీటి కాలువల ద్వారా పంపాలి. ఈ తెగులు నివారణ కు గానూ కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రా./లీ.+ ప్లాంటామైసిన్/ స్పీడో మైసిన్ 0.5 గ్రా. /లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.2.కాండం తొలిచే పురుగు:ఈ యాసంగిలో కాండం తొలుచు పురుగు (మొవ్వు చనిపోవడం) ఎక్కువగా గమనించడం జరిగింది. కావున చిరుపొట్ట దశలో రెక్కల పురుగుల ఉధృతిని బట్టి పురుగు మందులు తప్పనిసరిగా పిచికారి చేయాలి.చిరుపొట్ట దశలో ఆశించినట్టైతే తెల్ల కంకులు ఏర్పడతాయి. అంతేకాక గింజలు పాలు పోసుకోక తాలుగా మారును.చిరుపొట్ట దశలో ఉన్న వరి పైర్లలో కాండం తొలిచే పురుగు నివారణకు తప్పనిసరిగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP 400 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 60 మి.లీ. లేదా టెట్రానిలిప్రోల్ 80 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 9.3%+ లామ్దా సయలోహిత్రిన్ 4.6% ZC 80 మి. లీ. ఒక ఎకరాకు 200 లీ నీటిలో కలిపి పిచికారి చేయాలి.3 అగ్గితెగులు ఆకుల మీద ఏర్పడిన అగ్గితెగులు మచ్చలు క్రమేవి కణుపులకు వ్యాపిస్తాయి.వ్యాధి సోకిన మొక్కల కణుపులు గోధుమ రంగు లేదా ముదురు గోధుమ రంగుకి మారి కుళ్ళిపోవడం జరుగుతుంది.వెన్నులు వేసే దశలో ఈ శిలీంధ్రం ఆశించినట్లైతే తెగులు లక్షణాలు కంకుల మెడలపై కనిపిస్తాయి.గొలుసు మెడపై నల్లటి మచ్చలు ఏర్పడి ఆ తర్వాత ఎండిపోవడం వలన కంకులు విరిగిపోయి వ్రేలాడుతుంటాయి.ఈ దశలో వెన్నులలోని గింజులు తాలుగా మారుతాయి.నివారణ:వరి పైరు చిరుపొట్ట దశలో అగ్గి తెగులు లక్షణాలు గమనించినట్లతే ఆఖరి దఫా నత్రజని ఎరువును కొన్ని రోజులు తాత్కాలికంగా నిలిపివేయాలి.
లక్షణాలు గమనించినట్లనే పొలాన్ని ఆరబెట్టవద్దు, తద్వారా ఉదృతి అధికమయ్యే అవకాశం ఉంది.పూతదశ నుండి గింజ పాలు పోసుకునే దశలో అగ్గితెగులు లక్షణాలు తొలి దశలో గమినించినట్లైతే ఎకరానికి టైసైక్లోజోల్+ మ్యంకోజెబ్ 500 గ్రా. లేదా ఐసోప్రోథయోలేన్ 320. మి.లీ. లేదా కాసుగామైసిన్ 500 మి.లీ పిచికారి చేయాలి.ఉధృతి అధికంగా ఉన్నట్లైతే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ + టెబుకొనజోల్ 50% (75 WG) 80 గ్రా. లేదా పికాక్సిస్త్రోబిన్ 6.78% + ట్రైసైక్లోజోల్ 20:33% SC 400 మి.లీ. లేదా అజాక్సీస్ట్రోబిన్ 16.7% + ట్రైసైక్లోజోల్ 33:35% SC 200 మి.లీ. లేదా అజాక్సీస్ట్రోటెన్ 18.2% + డ్రైఫెన్ కొనజోల్ 11.4% ఎస్.సి 200 మి.లీ. ఎకరానికి పిచికారి చేయాలి.పత్తి లో రసం పీల్చే పురుగులు పచ్చ దోమ,తెల్ల దోమ అధికంగా ఉంది వీటి నివారణ కు గానూ ఎసిటమిప్రైడ్ 20%SP 50 గ్రా/ఎకరం లేదా డయాఫెంతుయురాన్ 50% SP 240 గ్రా /ఎకరం ఫ్లునికామిడ్ 50% WG 75 గ్రా/ఎకరం ను 200 లీ నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఇంకాసూక్ష్మ ధాతు లోప నివారణకు గాను ఫార్ములా 6 2 గ్రా/లీ,బోరాన్ 2గ్రా/లీ లేదా మెగ్నీషియం సల్ఫేట్ గ్రా/లీ కలిపి పిచికారి చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ శృతి,రైతులు తదితరులు పాల్గొన్నారు.