ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 12 : ధరణితో పాటు వివిధ సమస్యల పరిష్కార కొరకు ప్రజలకు అందించే దరఖాస్తును త్రికరణ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి.రాములుతో కలిసి రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ధరణి పోర్టల్ లో వివిధ భూ సమస్యలపై అందిన దరఖాస్తులను శునంగా పరిశీలించి,క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని,రెవిన్యూ డివిజన్ పరిధిలోని సమస్యలతో పాటు కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తిచేసేలా చూడాలని తెలిపారు.ఈ కార్యాలయంలో రాజస్థాన్ మండల అధికారి కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.