పిల్లలకు చదువుతోనే భవిష్యత్తు – చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి.

 

పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశం.

ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ కాంతి వల్లూరు.

సంగారెడ్డి జూలై 12 ప్రజ బలం ప్రతినిధి : విద్యార్థి దశలో కష్టపడి చదివితేనే భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. శుక్రవారం పటాన్చెరువు మండలం, ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని కిచెన్ షెడ్ ,స్టోర్ రూమ్, భోజనశాలను ఆమె పరిశీలించారు.
మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల సిబ్బంది కి సూచించారు. వంటగది స్టోర్ రూమ్ భోజనశాల పాఠశాల ఆవరణలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఇప్పటి నుండే విద్యార్థులు పోటీ పరీక్షలకు అనుగుణంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యం సాధించేందుకు కష్టపడి చదివి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో రెజ్లింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు ఇప్పటివరకు 11 సార్లు రెజ్లింగ్ స్టేట్ ఛాంపియన్షిప్ రెండుసార్లు నేషనల్ మెడల్స్ పొందినట్లు పాఠశాల రెజ్లింగ్ కోచ్ ప్రియాంక కలెక్టర్కు తెలిపారు. పాఠశాలలో అండర్ 14 నుండి 17 సంవత్సరాలు వయసుగల విద్యార్థులు ఉన్నారని వారికి లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని క్రీడలు విద్యార్థి మానసి కోలాసానికి దోహదం చేస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు అన్ని రకాలుగా తీర్చిదిద్దడానికి గురుకుల పాఠశాలల ద్వారా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దేవుజా, తహసిల్దార్ రంగారావు, కళాశాల ఆర్సిఓ భీమయ్య, ప్రిన్సిపల్ యోగేందర్ లక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, , ఎం పీ డి ఓ యాదగిరి, ఎం పీ ఓ హరిశంకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking