ఇదెక్కడి సామజిక న్యాయం రాజకీయ పార్టీలను ప్రశ్నించిన బూర్గుపల్లి కృష్ణ యాదవ్
మహబూబ్ నగర్ ఆగష్టు 29 ();బీసీలను పథకాలకే పరిమిటం చేస్తారా.. ఇదెక్కడి సామజిక న్యాయం అని బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించారు.మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గకేంద్ర లో బీసీ సేన నాయకులసమావేశం లో బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతు బీసీలను పథకాలకే పరిమితం చేస్తారా.. పాలనలో భాగస్వామ్యం కల్పించరా అని నిలదీశారు.కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేసిన మాదిరిగానే త్వరలో షాద్ నగర్ సభలోబీసీ డిక్లరేషన్ ప్రకటించాలని చూస్తుందని బీసీలకు కావాల్సింది డిక్లరేషన్ కాదు వచ్చే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా 60అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోజడ్చర్ల,మక్తల్ ,నారాయణపేట, దేవరకద్ర,మహబూబ్ నగర్, గద్వాల్, కల్వకుర్తి,షాద్ నగర్ నియోజకవర్గాలలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు బీసీలకేఅసెంబ్లీ సీట్లు కేటాయించాలని, లేనియెడల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు రాజకీయపతనం తప్పదని హెచ్చరించారు. సామాజిక న్యాయస్ఫూర్తిగా విరుద్ధంగా 115అసెంబ్లీ స్థానాలు కేటాయించిన బి ఆర్ఎస్ పార్టీ బీసీలకు రాజకీయంగా తీరని అన్యాయం చేసిందని వచ్చేఎన్నికలలో బీసీ శ్రేణులు బారాస పార్టీకీ చరమ గీతం పాడటం ఖాయమని అన్నారు.బీసీసేన నాయకులు, బొల్లెమోని నిరంజన్,సురభి విజయ్ కుమార్,లింగం పేట్ శేఖర్, గోపాల్, మాచారం శ్రీనివాస్,చంద్రమౌళి, సురభి రఘు,శివరాములు, కట్ట మురళి నర్సిములు,సురభి ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు
Next Post