ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 29 (ప్రజాబలం) ఖమ్మం సీఎల్పీ నేత మధిర శాసన సభ సభ్యులు మల్లు భట్టి విక్రమార్కనందినల తనయుడు సూర్య విక్రమాదిత్య జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం అన్నం పౌండేషన్ లో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సైదులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సూర్య విక్రమాదిత్య భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని దీవించారు. అనంతరం అన్నదానం చేయడం అభినందనీయమని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైదులును అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్నం పౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు హుస్సేన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్ గౌడ్,మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.