అరెస్ట్ అప్రజాస్వామికం…!

న్యాయమైన డిమాండ్ ను పరిష్కారించాలని ధర్నా చేస్తే నిర్బంధిస్తారా…?

ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావిద్

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 29 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ 54వ డివిజన్ లో వేస్తున్న 3.75 మీటర్ల రోడ్డును వెడల్పు పెంచి సుమారు 5 మీటర్ల వెడల్పు వరకు పెంచాలని న్యాయమైన డిమాండ్ తో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఇది అప్రజాస్వామి కమని ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ మండిపడ్డారు. టీడీపీ కార్యాలయం సమీపంలో వేస్తున్న ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. ఆ ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, రైతు మార్కెట్, ఇతర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలు ఉంటాయని ఈ నేపథ్యంలో వారు ప్రస్తుతం వేస్తున్న 3.75 మీటర్ల వెడల్పు రోడ్డు సరిపోదని రద్దీకనుగుణంగా 5 మీటర్ల వెడల్పు గల రోడ్డును ఖచ్చితంగా వేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సీటీసీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా మువ్వా విజయబాబు మాట్లాడుతూ కనీసం కార్పొరేషన్ కమిషనర్ కి గానీ ఇతర అధికారులకు గానీ వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు మొండి వైఖరి నాశించాలని నినాదాలు చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వచ్చాక ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కారించుకుంటామని తెలిపారు. అరెస్ట్ అయిన నేతలకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి, సర్పంచ్ గోనె భుజంగ రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. కాగా ధర్నా చేసిన వారిలో మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు,కార్పొరేటర్ లు మలీదు వెంకటేశ్వర్లు, లాకావాత్ సైదులు, మిక్కిలినేని నరేందర్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కొంగర జ్యోతిర్మయి, రాష్ట్ర మైనారిటీ నాయకులు రబ్బానీ,జిల్లా మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్, ఐ ఎన్ టీ యూ సీ నగర అధ్యక్ష, కార్యదర్శులు నరాల నరేష్ మోహన్ నాయుడు, నల్లమల సత్యం బాబు, సయ్యద్ గౌస్, ముజహిద్, అబ్దుల్ అహద్,వీరయ్య గౌడ్, రంజాన్, విప్లవ్ కుమార్, సంపెట శ్రీను, కె. చంద్రశేఖర్, రవి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking