ఓటమి అంచునా ఈటేల?

కూకట్‌పల్లిలో కమలంకు ఎదురుగాలి.. బిజెపిలో కలసి రాని నాయకులు, కార్యకర్తలు.
తూ తూ మంత్రంగానే సహకారం.
నాయకుల్లో సఖ్యత లేక చీలుతున్న ఓట్లు.

(కూకట్‌పల్లి, ప్రజాబలం న్యూస్)మే:11కూకట్‌పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలు మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓటమి అంచునకు తీసుకెళ్తున్నాయనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. అధికార పార్టీకి, బిఆర్ఎస్ కు దీటుగా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ కూకట్‌పల్లి బిజెపి నాయకుల్లో ఉన్న గ్రూపు రాజకీయాలు ఈటేల కొంప ముంచేటట్లుగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సౌమ్యుడు మంచి మనిషిగా గుర్తింపు ఉన్న ఈటల రాజేందర్ కు ఓటర్లు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇక్కడి గ్రూపు రాజకీయాల వల్ల నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో బిజెపికి అనుకూలంగా ఉన్న ఓట్లు మరో పార్టీకి బదిలీ అయ్యే అవకాశం లేకపోలేదు. దీనికి తోడు బిఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చూసి మల్కాజిగిరి పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థి రాగిణి లక్ష్మారెడ్డికి ఓటు వేయండని ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం లో బిజెపి ఓట్లు చీలిపోతాయనడంలో సందేహమే లేదని స్థానిక ప్రజలు చర్చించు కుంటున్నారు. మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఈటేల రాజేందర్ కు సానుకూల పవనాలు వేస్తున్న… కూకట్‌పల్లి లో మాత్రం బిజెపి ఓట్లు కష్టమే అనే వాదన ప్రజల్లో వినిపిస్తుంది. కూకట్‌పల్లి బీజేపీ లో ఉన్న వర్గ పోరు బిజెపికి చేడు చేస్తుందే తప్పా… ఉపయోగం లేదనే విషయం బిజెపి సీనియర్ నాయకులకు సైతం తెలిసిన పరిష్కరించకపోవడం విచారకరం. బిజెపి నాయకుల మధ్య ఉన్న వర్గ పోరు వల్ల క్రింది స్థాయి నాయకులు అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. కిందిస్థాయి క్యాడర్ ను నిర్లక్ష్యం చేయడంతో ఎన్నికల సమయంలోనే మేము గుర్తుకు వస్తామా..? అనే నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టులాడుతున్నట్టు తెలుస్తోంది. నాయకులు సైతం కొంతమందికే ప్రాధాన్యత ఇవ్వడం, మరి కొంతమందిని చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల కార్యకర్తల సైతం పార్టీ కార్యక్రమాల్లో తూతూ మంత్రంగానే పాల్గొంటున్నారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఒకవైపు, గ్రూపు రాజకీయాలు మరోవైపు వల్ల బిజెపికి అనుకూలంగా ఉన్న ఓట్లు సైతం చీలిపోయే అవకాశం ఉందని స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతుంది. కూకట్‌పల్లి నియోజకవర్గం లో బిజెపి ఎప్పుడు బలపడుతుందో వేచి చూడాలి… మరి.!!

Leave A Reply

Your email address will not be published.

Breaking