ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 31 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకల నిర్వహణ కొరకు జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఆవరణలో ఏర్పాట్లు చెయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఆవరణలో కలెక్టరెట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, కలెక్టరేట్ సి విభాగం పరిరక్షకులు సంతోష్, ఈ డిస్టిక్ మేనేజర్ సునీల్ తో కలిసి వేడుకల ఏర్పాట్లు ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… లోక్సభ ఎన్నికల ప్రవర్తన జూన్ 6వ తేదీ వరకు అమల్లో ఉన్నందున భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.