జగిత్యాల ప్రతినిధి, జూలై 6(ప్రజాబలం) విశ్వహిందూ పరిషత్ జగిత్యాల పట్టణ అధ్యక్షులుగా జిట్టవేని అరుణ్ కుమార్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ ఉత్తర్వులు జారీచేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన గురువారం జరిగిన వి.హెచ్.పి సమావేశంలో జిల్లా అధ్యక్షులు పద్మాకర్ నూతన నియామకాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో వి.హెచ్.పి జగిత్యాల పట్టణ అధ్యక్షులుగా జిట్టవేని అరుణ్ కుమార్, నగర కార్యదర్శిగా గణపతి నరేందర్ రాజు ను నియమించారు. తమ నియామకాలకు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మామిడాల రాములు, నగర ఉపాధ్యక్షులు ముస్కరి ప్రశాంత్ గాజోజు సంతోష్ తోపాటు పలువురు ఉన్నారు.