ఎర్రగడ్డ ఆస్పత్రిలో అరవింద్ ను చేర్చాలి

 

పార్లమెంట్ ను విడిచి రాజకీయాలా

_జగిత్యాల లో ప్రశాంతతను చెడగొట్టేందుకే అర్విం ద్ కుట్ర
_
బీఆర్ ఎస్ యూత్ నాయకులు ముఖేష్ ఖన్నా

జగిత్యాల, ఫిబ్రవరి 11:పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా అభివృద్ధి పై చర్చించాల్సిన ఎంపీ అర్వింద్ పారిపోయీ వచ్చి జగిత్యాల లో పరామర్శల పేరిట ప్రశాంతతను చెడగోట్టాలని చూస్తున్న ఎంపీ అర్వింద్ ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాలని బీఆర్ ఎస్ యువజన నాయకులు బాగోజి ముఖేష్ ఖన్నా ఆరోపించారు. శనివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పార్లమెంట్ సెషన్ నడుస్తుండగా అభివృద్ధి అంశాలపై చర్చించకుండా రాజకీయాలే లక్ష్యంగా ఉకే జగిత్యాల కు వస్తూ ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడన్నారు. వచ్చిన ప్రతిసారి మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను మా అక్క కవితక్కను విమర్శించడమే పనిగా పెట్టుకొన్నాడన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడమే పనిగా పెట్టుకొన్నదని ఇన్నాళ్లు మా నాయకులు చేతులు కట్టేశారని ఇక నుంచి ఊరుకోమని మా నాయకులను విమర్శిస్తే నాలుక కొస్తామని ముఖేష్ హెచ్చరించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సేవాభావం కలిగిన వ్యక్తి అని ఎందరికో కంటిచూపు ప్రసాధించాడన్నారు. ఎంపీ అర్వింద్ మోసగడని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసగించిన ఘనుడన్నారు. అర్వింద్ ఇంట్లో మూడు పార్టీల మనుషులున్నారని అన్నారు. స్వంత పార్టీ బిజెపిలోనే జగిత్యాల లోని సీనియర్లను సస్పెండ్ చేయించిన ఘనత అర్వింద్ కు దక్కుతుందన్నారు. పార్లమెంట్ పరిధిలో అభివృద్ధిని విడిచిపెట్టి పరామర్శల పేరిట జగిత్యాల కు రావడం మా ఎమ్మెల్యే రాచరిక పాలన అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. బిసి బిడ్డ అని ప్రకటించుకుంటున్న ఎంపీ అర్వింద్ బిసిలకు ద్రోహం చేస్తున్నాడని కేంద్రం బిసి కులగణన చేపట్టడం లేదని, కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖ పై ఏనాడు అర్వింద్ ప్రశ్నించక ద్రోహం చేస్తున్నాడని ముఖేష్ అన్నారు. అర్వింద్ తెచ్చిన నిధులెన్నో, చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలని దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖేష్ ప్రశ్నించారు. అర్వింద్ కు చేతనైతే తిరుపతి కి వెళ్లే రైలును వారానికి మూడుసార్లు నడిపించేదుకు కృషి చేయాలని, చేతనైతే జగిత్యాల నుంచి ఢిల్లీకి రైలు నడిపించాలని సూచించారు. పసుపు రైతులకు ధర రావడం లేదని రైతులను పరామర్శించాలని రాజకీయాల కోసం జగిత్యాల కు వస్తూ మా ఎమ్మెల్యే సంజయ్ ను, మా అక్క కవితను విమర్శిస్తే ఊరుకోమని నాలుక చిరుస్తామని ముఖేష్ ఖన్నా హెచ్చరించారు. ఆయన వెంట బి.సి.నాయకులు పులి నర్సయ్య, సుంకే మహేష్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking