సినీ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ అభినందన
హైదారాబాద్ ఫిబ్రవరి 11 (); ప్రకృతి పట్ల ఉదాసీనత పెరిగి పోయి విపత్తులు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ తన బాధ్యతగా ప్రకృతి పరిరక్షణ కోసం పరి శ్రమించడం అభినందనీయమని సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు, ప్రముఖ నటులు వై. కాశీ విశ్వనాథ్ అన్నారు. శనివారం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ గౌరవాధ్యక్షులు ఉప్పల వెంకటేష్ గుప్తా, వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య తదితరులు కాశీ విశ్వనాథ్ ను ఫిల్మ్ నగర్లో కలిసి సంస్థ రూపొందించిన 2023 సంవత్సర క్యాలెండర్ అందజేశారు. ఈ సందర్భంగా దర్శకులు కాశీ సంస్థ కృషిని కొనియాడారు. తానూ ప్రకృతి ప్రేమికుడినేనని తన వంతుగా సంస్థ కృషికి సహకరిస్తానన్నారు. ఇంకా సినీ, టీవీ నటులు, యాంకర్ టి.వి. రమణ తదితరులు పాల్గోన్నారు.
Prev Post
Next Post