మార్చి 4న ఛలో పెద్దపల్లి

 

కాన్షిరాం విగ్రహావిష్కరణ

గోడపత్రికను ఆవిష్కరించిన సర్వన్ కౌర్

పెద్ద పెళ్లి ప్రజాబలం ఫిబ్రవరి 11

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జండా చౌరస్థ వద్ద 8వ, వార్డు ఎంఐఎం కౌన్సిలర్ బొంకూరి.భాగ్యలక్ష్మి – సురేందర్ సన్ని అద్వర్యములో నిర్మించిన మాన్యవర్ కాన్షిరాం నిలువెత్తు విగ్రహాన్ని మార్చి 4వ,తేదీన తెలంగాణ ప్రజాసంఘాల జె ఏ సి,తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం ఆద్వర్యములో కాన్షిరాం సోదరి కాన్షీరాం ఫౌండేషన్ చైర్మన్( జన్మ స్తల్) శ్రీమతి స్వరన్ కౌర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఈ మహా కార్యానికి సంబందించిన వాల్ పోస్టర్ ను పంజాబ్ లోని కాన్సిరాం గారి జన్మ స్థలమందు వారి సోదరి స్వరన్ కౌర్ చేతుల మీదుగా శనివారం రోజున ఆవిష్కరించారు. అనంతరం స్వరన్ కౌర్ కాన్సిరాం గారి మేనల్లుడు రవీందర్ సింగ్ లు మాట్లాడుతూ తెలంగాణలోని పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మాన్యవార్ కాన్షిరామ్ గారి విగ్రహావిష్కరన మహోత్సవానికి మార్చి 4వ తేదీన రానున్నట్లు బొంకూర్ సురేందర్ సన్నీ తెలిపారు అభిమానులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. అనంతరం కౌన్సిలర్ భాగ్యలక్ష్మి పంపించిన నూతన వస్త్రాలను తెలంగాణ ప్రజాసంఘాల జె ఏ సి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి.సురేందర్ సన్ని వారి కుటుంబ సభ్యులకు అందించి వారి ఆశీర్వాదమును పొందారు. ఈ కార్యక్రమములో బొంకూరి సురేందర్ సన్ని,కాన్షిరామ్ గారి మేనల్లుడు రవీందర్ సింగ్ కాన్షిరామ్, సాతూరి అనిల్ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking