స్వచ్చ మనికొండ కార్యాక్రమంలో పాల్గోన్న సీనీనటుడు శివారెడ్డి

మణికొండ ప్రజాబలం ప్రతినిధి: ప్రస్తుత దేశ పరిస్థుతులలో ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య మనం నివసిస్తున్న ఇంటి చుట్టూ, వాడలలో, కాలనీపరిసర ప్రాంతాలలో తరుచుగా కనిపించేది చెత్తా చెదారం వాటిని నిర్మూలించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత.

స్వచ్చ తెలంగాణలో బాగంగా, స్వచ్చ మనికొండ అనే కార్యక్రమాన్ని మునిసిపల్‌ కమీషనర్‌ ఫాల్గున్‌ కుమార్‌ మరియు వారి సిబ్బంది ద్వారా పరిశుభ్రతపై ప్రతీ ఒక్కరికీ అవగాహన రావాలని మన చుట్టు పక్కల ఉన్న చెత్తా చేదారాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని చైతన్యవంతం చేయాలనే సదుద్ధ్యేశంతో స్వచ్చ సర్వెక్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చలన చిత్ర కళా కారుడు శివారెడ్డి వారితోపాటు కౌన్సిల్‌ ఛైర్మన్‌ కస్తూరి నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ప్లోర్‌ లీడర్‌ రామకృష్ణా రెడ్డి, ఆల్‌ కాలనీ ప్రసిడెంట్‌ సీతారాం ధూళిపాల, కార్యదర్శి ఆంజనేయులు, స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సబ్యులు, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీరాములు, బీజేపీ అధ్యక్షడు సిద్దప్ప, వీ ఆర్‌ ఫర్‌ యు వయోజన సంస్థ తరఫున అందె లక్ష్మణ్‌ రావు ఇతర సభ్యులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వచ్చత, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతం చేయడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking