ప్రజాబలం ప్రతినిధి జనవరి 11రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమార ప్రసాద్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, బైండ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం 11.2.2023నాడు తూప్రాన్ ఎస్. ఐ. గారికి పిర్యాదు చేయడం జరిగింది. ప్రపంచ మేధావి, ఈ దేశానికి వెన్నెముకైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రపంచ మేధావిని ఒక కులానికి అంకితం చేసి మాట్లాడడం సిగ్గు మాలిన చర్యగా అభివర్ణించారు. తాను అంబేద్కర్ కాలంలో ఉంటే మరోగాడ్సేలా మారి చంపేవాడినని అనడం హమార ప్రసాద్ అహంకారానికి నిదర్శనం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హమార ప్రసాద్ పై అట్రాసిటీ కేసు దేశద్రోహి కిందకఠినంగా వ్యవహరించాలని, వెంటనే అరెస్టు చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, బైండ్ల సంక్షేమ సంఘం నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, చెట్ల పల్లి యాదగిరి మాదిగ, సర్గల పర్శరాములు మాదిగ, నర్సింలు బైండ్ల గుడ్డి రమేష్, కొండయ్య, ఎండ్రలి జానీ.గజ్జల మహేష. శ్రీకాంత్ దితరులు పాల్గొన్నారు.
సామాజిక ఉద్యమాలతో….
మీ……
ఎమ్మార్పీఎస్ Ê ఎంఎస్పి
మెదక్ జిల్లా కమిటీ.
855549245
9704449021