శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల కోసమే పోలీస్ లు సీఐ కృష్ణ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 26 : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల కోసమే పోలీసులున్నారని సీఐ కృష్ణ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని తలమల గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ…రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్,(డిఐజీ) ఆదేశాల మేరకు,లక్షెట్టిపేట సీఐ ఎస్ఐ ల ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి తలమలలో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు. వాహన పత్రాలు సరిగా లేని 10 మోటార్ సైకిల్లు చెక్ చేయడం జరిగింది.నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ,ప్రజలకు భద్రత భావం సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా? అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఎవరైనా కొత్త వ్యక్తులు మీ దగ్గరకు వస్తే వారి పూర్తి వివరాలు అడిగి వారి వద్ద నుండి ఆధార్ కార్డ్ తీసుకోవాలి ఏమైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలి.వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలన్నారు.వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయం లో ఇన్సూరెన్స్ వర్తించదని, ఇన్సూరెన్స్ గడువు ముగియక ముందే దానిని రినివల్ చేపించుకోవాలని సూచించారు.ప్రజల రక్షణ, ప్రజలకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు అనే భరోసా నమ్మకం,తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు, మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మనకు తెలియనటువంటి నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్లను లింకును ఓపెన్ చేయొద్దు అని,అత్యాశకు పోయి లాటరీ వచ్చిందని, లోన్ వచ్చిందని వచ్చిన, ఏదైనా గిఫ్ట్ లు వచ్చాయని ఫోన్ కాల్స్ వచ్చిన మెసేజ్ లు వచ్చినా వెంటనే వాటికి సమాధానమిస్తూ ఓటిపి లను పిన్ నెంబర్ లను చెప్పకూడదన్నారు.సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ట్లయితే వెంటనే 1930 లేదా డయాల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.ఎవరిదైనా మొబైల్ పోయిన, దొంగిలించబడిన యెడల సీ ఈ ఐ ఆర్ పోర్టల్ నందు తమ వివరాలను నమోదు చేసుకున్నచొ వారికి మొబైల్ దొరికే అవకాశం ఉన్నందున ఈ పోర్టల్ ను వినియోగించుకోవాలని తెలిపారు.మహిళలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నచో రామగుండం కమిషనరేట్ పరిధిలో గల షి టీం 6303923700 నెంబర్ కు ఫోన్ చేసినట్లయితే తక్షణ పరిష్కారం లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మణ్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking