నిర్మల్ లోదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ సంక్షేమ సంబరాలను స్థానిక దివ్యాగార్డెన్ లో ఘనంగా నిర్వహించారు

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పి ఛైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి లు పాల్గొని జ్యోతి ప్రజ్వలనగావించారు.
ఈ సందర్బంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన లబ్దిదారులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని దీనివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయాని సంతోషం వ్యక్తం చేశారు.
మంత్రి మాట్లాడుతూ బిసి కులవృత్తులకు లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న 19 గురుకులాలు నేడు 294 పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించడం జరిగిందన్నారు. విద్యార్థినీ విద్యా ర్థులు 2023-24 విద్యా సంవత్సరానికి 1,81,880 పెరిగారని, గురుకులాలకు వసతి గృహాల విద్యార్థిని విద్యార్థులకు ఒక రూపాయికే కిలో సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే విదేశీ విద్యానిధి ద్వారా ప్రతి సంవత్సరం 300 మందికి 20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు.
కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి 100116 రూపాయలను అమ్మాయిల వివాహానికి కానుకగా ఇవ్వడం, బీసీ కులాల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి హైదరాబాద్ మహానగరంలో ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి ఏర్పాటు చేయడం జరిగిందని 17 కులాలను రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చడంతో పాటు బీసీలలో అత్యంత వెనుకబడిన కులాల కోసం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం,
నాయి బ్రాహ్మణ రజక వృత్తిదారుల ఆదాయాన్ని పెంపొందించడానికి ఉచితంగా 250 యూనిట్ల వరకు విద్యుత్ను దుకాణాలకు అందించడం,బీసీ రిజర్వేషన్లు పొడిగించడం,నూతన బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం,
బీసీ, ఈ బీసీల కొరకు ఇప్పటివరకు 6,14, 640 కుటుంబాలకు 5629.74 కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందన్నారు.
మహాత్మ జ్యోతిబాపూలే బిసి ఓవర్సీస్ విద్యానిధి ద్వారా 3354 మంది విద్యార్థులకు 346.21 కోట్లను అందజేయడం,
పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఇప్పటివరకు 13812601 మంది విద్యార్థులకు 11247.97 కోట్ల రూపాయలు అందజేయడమైనదని
బీసీ స్టడీ సర్కిల్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు 52746 మంది అభ్యర్థులకు 60.83 కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించిన వివిధ కోచింగ్ ప్రోగ్రామ్లలో శిక్షణ పొందారన్నారు.
ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 చొప్పున రైతులు లబ్ధి పొందుతున్నారు ఏదైనా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా పథకం కూడా వర్తిస్తుంది అంతేకాకుండా దళితుల అభ్యున్నతికై దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని
నాయి బ్రాహ్మణులచే నడపబడుచున్న షౌరశాలలకు ఒక్కొక్కదానికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం ద్వారా 35522 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
అనంతరం గొర్రెలను పంపిణి చేశారు.

ఈ కార్యక్రమం లో.ఆర్ డి ఓ స్రవంతి,సంక్షేమ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking