ప్రభుత్వ సూచనల ప్రకారం జిల్లాలో పనులు పురోగతి

 

వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 24:
శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, సమగ్ర మహిళా ఆరోగ్య కార్యక్రమం, ప్రబుత్వ ఉత్తర్వులు 58, 59, 76, 118 కింద రెగ్యులరైజేషన్, పట్టాలు పంపిణీ, సోషల్ వెల్ఫేర్ హౌస్ సైట్లు, పీఎంఏమై అర్బన్, డబుల్ బెడ్రూమ్లు, పోడు భూములు, వేసవి వేడి తరంగాల కోసం సంసిద్ధత– అగ్ని ప్రమాదాలను నివారణ, ఐడీవోసీల ఆక్యుపెన్సీ, నిర్వహణ, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ వార్షిక పరీక్షలు, హరితహారం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా అంశాలపై సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్యతో పాటు సంబంధిత శాఖల అధికారులు జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభుత్వం సూచించిన మేరకు పక్కాగా చేపడుతున్నామని కలెక్టర్ అమోయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వివరించారు. ప్రభుత్వ ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నామని అందుకు సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) 58, 59, 118కి సంబంధించి మార్చి 30వ తేదీ వరకు పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తామని ఈ విషయమై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మండలాల తహశీల్దార్లతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అమోయ్ కుమార్ సీఎస్ శాంతికుమారికి వీడియో కాన్ఫరెన్స్లో తెలిపినారు. ఈ విషయాలకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో పాటు వారిని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు వివరించేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు పర్యటించిన వివరాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) 58,59, 118 లను మార్చి 30వ తేదీ వరకు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వివరించారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో జిల్లాను ముందు నిలపాలని సంకల్పంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, సూచనలు తప్పకుండా పాటిస్తామని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking