వలసల నాయకులకు పదవులు
స్థానికులకు డబుల్ ఇండ్లు రావడం లేదని నిరసన
రోడ్డు కటింగ్ లో ఇండ్లు కోల్పోయిన నిరుపేదలకు
మున్సిపాలిటీ కి చెందిన ముఖ్య ప్రాజ ప్రతినిది బాగోతంతో
డబుల్ ఇండ్లలో అన్యాయం.
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-మెదక్ జిల్లా ముఖ్యమంత్రి నియోజకవర్గం తూప్రాన్ మున్సిపల్ లో జరిగిన ఆత్మీయ కార్యకర్తల సమావేశంలో అడుగడునా నిరసనలు తెలిపిన ఉద్యమ నాయకులు, కార్యకర్తలు సీనియర్ నాయకులు శ్రీశైలం గౌడ్ డబుల్ బెడ్ రూంల పంపిణీలో అక్రమాలు పెరుకుపోయని సభాముఖంగా తెలిపారు. మరియు తూప్రాన్ సీనియర్ నాయకులు రాజేశ్వర శర్మ పంతులు, కౌన్సిలర్ కోడిప్యాక నారాయణ గుప్తా మాట్లాడుతూ స్థానిక పేద ప్రజలకు రావడం లేదని వాపోయారు. రోడ్డు నిర్మాణ కటింగ్ పొయీన బాధితులో అన్యాయం జరిగిందని, మున్సిపాలిటీ కీలక ప్రాజ ప్రతినిది తన ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన వారికి డబుల్ బెడ్రూం (రెండు పడక గదులో అన్యాయం జరిగిందని, స్థానికంగా, భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇండ్లు ఇవ్వడం లేదని వాపోయారు.కోందరు తనకు సన్నీహితంగా ఉన్నవారికి మరి కొందరు ప్రజా ప్రతినిధులైతే కీలక వ్యాక్తి తన స్వంత ప్రయెజనాలు ,కోసం ఇచ్చారని, మరి కోందరైతే అమ్యమలు అశపడ్డారని ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి అని పేర్కొంటూ డబుల్ బెడ్ రూం లు పేదవారికి రాకపోవడం చాలా ఇబ్బందికర విషయమని కొంతమంది నాయకులు డబుల్ ఇండ్ల పంపిణీని ఒక వర్గంగా ఏర్పడి వారి మనుగడకోసం అనుకూలమైన వారికి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపేదల చెందాలని వారి సంకల్పమని, మన ప్రభుత్వ పెద్దలు ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా రిసర్వే చేయించాలని మంచి అధికారిని నియమించి నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ చెందెట్టట్టు చూడాలని డబుల్ బెడ్ రూమ్ బాధితులు మరియు బిఆర్ఎస్ నాయకుల ఆవేదన , బి.ఆర్.యస్. ఉద్యమ నాయకులు, శలక రాజేశ్వర శర్మ, నాగరాజు మన్నె శ్రీనివాస్, రమేష్ లు మాట్లాడుతూ కార్యకర్తలకు ఉద్యమ నాయకులకు అడుగడునా అన్యాయం జరుగుతుందని బి.ఆర్. యస్. నామినేటెడ్ పోస్టులలో మాకు ఎక్కడ ఇవ్వడం లేదని ప్రతి ఉద్యమ నాయకులు వారి ఆవేదనను తెలియచేశారు. వలస నాయకులకు పదవులు ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. అదేవిధంగా దళితులకు దళిత బందు అందరికీ వస్తుందని చెప్పడం తప్ప రావడం లేదని కొంతమందికి వస్తుందని దళిత నాయకుడు స్వార్గల శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు.