హనుమకొండ లో సదరన్ ట్రావెల్స్ కార్యాలయం ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి:

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 13:

50 సంవత్సరాల అనుభవంతో దేశవ్యాప్తంగా బ్రాంచీలను తెరుస్తూ ట్రావెల్స్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతు వినియోగదారులకు ఆకర్షనీయమైన రవాణా ప్యాకేజీలు అందిస్తూ ఆకట్టుకుంటున్న సదరన్ ట్రావెల్స్ హనుమకొండ నగరంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. మంగళవారం హనుమకొండ జిల్లా నయీమ్ నగర్ లోని కాంప్లెక్స్ లో పాటు చేసిన సదరన్ ట్రావెల్స్ నూతన కార్యాలయాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన కావించి రిబ్బన్ కటింగ్ తో కార్యాలయాన్ని ప్రారంభించారు. సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అల్లాపాటి  వెంకటేశ్వరరావు చైర్మన్ గ, ప్రవీణ్ కుమార్,కృష్ణమోహన్  మేనేజింగ్ డైరెక్టర్ గా,  రామ రావు ఆపరేషన్ డైరెక్టర్ గా 1950లో న్యూఢిల్లీలో మొట్టమొదటి కార్యాలయం స్థాపించి భారత దేశవ్యాప్తంగా విస్తరించింది సధరన్ ట్రావెల్స్ అని అన్నారు. హైదరాబాద్ తో పాటు వరంగల్ నగరంలో ఆలయం ప్రారంభించడం పరిణామమని అని అన్నారు. ఇలాగే దిన దిన అభివృద్ధి చెందుతూ అన్ని జిల్లాలలో కార్యాలయాలను ప్రారంభించుకోవాలని కోరారు. సదరన్ ట్రావెల్స్ ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులు ఈశ్వరరావు రామారావు లకు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు బిజెపి నాయకులు గుండా ప్రభాకర్ గుప్తా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపి శివరామయ్య, దివ్య వినీల రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking