తూప్రాన్ లో ఆత్మఘోష దీక్ష.

 

మెదక్ తూప్రాన్ 12/04/2023 ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా లెక్చరర్ సామాజిక విశ్లేషకులు శ్రీనివాస్ చారి తూప్రాన్ ప్రజల ఆత్మఘోష దీక్ష చేపట్టారు.
‘ఆత్మీయ సమ్మేళనాల’ పేరుతో కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆత్మఘోషలు కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీ అస్తవ్యస్త పాలన గురించి, అవినీతి, అలసత్వ వైఖరి గురించి, పారదర్శకత లేని, జవాబుదారితనం లేని – నియంతృత్వానికి వ్యతిరేకంగా రోడ్ కటింగ్ పొయీన వాళ్ళకు అందరికీ సమానంగా ఇప్పించకుండా తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించిన తూప్రాన్ మున్సిపాలిటీ ముఖ్య ప్రతినిధి డబుల్ బెడ్రూం ఇండ్లలో అవినీతి గురించి తూప్రాన్ ప్రజలు స్వచ్ఛందంగా మొదలుపెట్టిన ఆత్మఘోష దీక్ష.

తూప్రాన్ ప్రజల సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రి హరీష్ రావు దృష్టికి ప్రభుత్వ పెద్దల ద్రుష్టికి వెళ్లే వరకు, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కొనసాగుతుంది. రూపాలు వేరు వేరు అయినా దీక్ష స్వరూపం, స్వభావం మాత్రం ఒక్కటే… తూప్రాన్ విముక్తి. సుపరిపాలనకు తూప్రాన్ ఒక ఉదాహరణగా మారాల్సిన అవసరం ఉంది. ఒక్క అవినీతి చర్య కూడా జరగకుండా జవాబుదారీతనం, పారదర్శకత, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు సామాజిక కార్యకర్త కే శ్రీనివాసాచారి అయిన నేను ఈ దీక్షను ఒక్కడిగా ప్రారంభం చేశాను. ఇది క్రమక్రమంగా తూప్రాన్ లోని ప్రతి పౌరుడికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నాను.

ప్రజల్లోతమ హక్కుల పట్ల, తమ ఆత్మ గౌరవం పట్ల, తమ బాధ్యతల పట్ల, తమకు ఉన్న సమస్యల పరిష్కారంలో ఏ కొంతమందిని కదిలించినా, స్ఫూర్తి రగిలించినా నా ఈ చిన్న ప్రయత్నం ఫలించినట్టే. నేటి “తూప్రాన్ ప్రజల ఆత్మఘోష” అనే చిన్న మొదటి అడుగు రేపు తెలంగాణ అంతటా “తెలంగాణ ఆత్మఘోష” గా విస్తరిస్తుంది. ఆలోపే తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని ఆత్మఘోష దీక్ష గుర్తుచేస్తుంది. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు తూప్రాన్ మున్సిపాలిటీ పై ద్రుష్టి సారించి తూప్రాన్ అభివృద్ధికి సహకరించాలని మన పెదల పెన్నిధి మన మంత్రి హరీష్ రావు ప్రత్యెక చొరవతో డబుల్ బెడ్రూం జరిగిన అవినీతి సంఘటనను గుర్తించి
రీ సర్వే చేయించి నిజమైన లబ్దిదారులకు అందించాలని తూప్రాన్ గ్రామస్థులు కొలుస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking