ప్రజాబలం వర్ధన్నపేట నియోజకవర్గం ఏప్రిల్ 13: సిద్దాపురం గ్రామానికి చెందిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యూత్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా యూత్ ప్రెసిడెంట్ బండి అనుదీప్ గౌడ్, గ్రామ సర్పంచి ధనలక్ష్మి కిరణ్ లు వర్ధన్నపేట సోషల్ మీడియా అధ్యక్షులు ఆరూరి విశాల్ గౌడ్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ వద్ద బుదవారం కలుసుకొన్నారు. ఈ సందర్భంగా యూత్ నాయకులను ఘనంగా సత్కరించి రిజిస్ట్రేషన్ పత్రాలను ఆరూర్ విశాల్ యూత్ సభ్యులకు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాకముందే గ్రామానికి ఎన్నో సేవలు చేశారని ఇప్పుడు మరింతగా సిద్దాపురం గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గ్రామ సర్పంచ్ ధనలక్ష్మి కిరణ్ మాట్లాడుతూ గ్రామ యూత్ పల అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లా లని అన్నారు. రిజిస్ట్రేషన్ సహకరించి అభివృద్ధికి సహకరిస్తానన్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న యూత్ అసోసియేషన్ వాయిస్ ప్రెసిడెంట్ తాబేటి ప్రణయ్ గౌడ్, సెక్రటరీ అరవింద్ గౌడ్ యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు.