ప్రచార ఆర్బాటం కోసం ప్రజల ప్రాణాలు తీస్తారా?

 

అయిత గాని శ్రీనివాస్ గౌడ్
బి.ఎస్.పి. ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జ్

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 12 (ప్రజాబలం)ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం, చీమలపాడు లో బి.ఆర్.ఎస్. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన లో మృతులు, క్షత గాత్రులకు న్యాయం చేయాలని బి. ఎస్. పి. ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో బి. ఎస్. పి. ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జ్ అయితగాని శ్రీనివాస్ గౌడ్* మాట్లాడుతూ బి.ఆర్.ఎస్. నాయకుల అత్యుత్సాహం, ప్రచార ఆర్భాటంతో బాణాసంచా కాలుస్తున్న సందర్బంగా నిప్పురవ్వలు పక్కనున్న గుడిసెల మీద పడి గుడిసెలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ పేలిపోయి 3 (ముగ్గురు) వ్యక్తులు మరణించడం,
15 మంది తీవ్ర గాయాల పాలవడం జరిగిందని, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో
బి.ఆర్.ఎస్ పార్టీ మారణ హోమానికి పాల్పడుతోందని ప్రచార ఆర్భాటంతో ప్రజల ప్రజల ప్రాణాలు తీస్తోందని, ఈ ఘటన కేవలం బి.ఆర్.ఎస్. నాయకుల తప్పిదమేనని, మృతులకు బి.ఆర్.ఎస్. నాయకులు బాధ్యత వహించాలని, పార్టీ కార్యక్రమం లో జరిగిన ఘటన కాబట్టి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను బి. ఆర్. ఎస్. పార్టీయే చెల్లించాలని, మెరుగైన వైద్యం అందించాలని, కాలిపోయిన ఇళ్ల స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. శాంతిపూర్వక నిరసన తెలియజేస్తూ ఉండగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. దాంతో ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న బీఎస్పీ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

మృతులు కుటుంబాలకు మరియు క్షతగాత్రులకు న్యాయం జరిగేవరకు వారి పక్షాన బి. ఎస్. పి. పోరాడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి. జిల్లా కార్యదర్శులు బానోత్ రాంబాబు, బి. ఉపేందర్, అయితగాని శ్రీనివాస్ గౌడ్, ఎం. సుభాష్ చంద్రబోస్, మహిళా కన్వీనర్లు బానోత్ రజిని, ఉప్పల మంజుల, అనిత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking