ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 12 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 8.00 గంటలకు జిల్లా ప్రజాపరిషత్ కూడలిలో డా. బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అనంతరం శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇట్టి కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజలు పాల్గొని జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలనీ కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.