పల్లెల్లో ‘ఆత్మీయ’ గుబాళింపు

 

– కేసీఆరే దేశానికి శ్రీరామరక్ష

– బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలి

– ఊరూరా అభివృద్ధి. గడపగడపకు ప్రజా సంక్షేమం

-బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి

-కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ కి బలం
– బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్న శక్తి సామర్థ్యాలు ప్రత్యర్ధులకు లేవు
స్
-మోడీ ని నిలువరించే నాయకుడు, దేశాన్నీ రక్షించగల నాయకుడు కేసీఆర్

జగిత్యాల ప్రతినిధి, మార్చి 27 (ప్రజాబలం) ఈ.డి, సిబిఐ లతో ప్రజాస్వామ్యాన్నీ కూనీ చేస్తున్న ప్రధాని మోదీని నిలువరించే సత్తా కలిగిన నేత కేసీఆర్ అని దేశానికి శ్రీరామ రక్ష కేసీఆర్ అని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జడ్పి చైర్మన్ దావా వసంత లు అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ లు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు,మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని వారిని నమ్మవద్దని కోరారు. శ్రుతి మించుతున్న బీజేపీ దుర్మార్గాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9ఏండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశం చేశారన్నారు. బీఆర్ఎస్ దేశానికే రోల్ మాడల్ గా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా అమలుకావడం లేదన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్టీ శ్రేణులంతా ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు.మహిళల హక్కుల కోసం పోరాడుతున్న కవితక్క గారిపై బిజెపి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నది. అవగాహన లేని బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.
బిజెపి అధినాయకత్వం కుట్ర పూరితంగా కవితక్క పై కేసు పెట్టినా పారిపోకుండా ధైర్యంగా విచారణ ఎదుర్కొంటున్నారన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బిజెపి బ్రోకర్లు, వారి వెనకాల ఉన్న బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. కానీ కవితక్క మాత్రం ఏ తప్పు చేయకున్నా, ధీరవనితలు రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయిలా ధైర్యసాహసాలతో పోరాడుతున్నారు. బీజేపి ఏతర పాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను కేంద్ర ప్రభుత్వం తమ స్వార్ధ రాజకీయాల కోసం ఏవిధంగా వాడుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాలని కోరారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాష్ట్రం అవిర్భవించక ముందున్న పరిస్థితులు, రాష్ట్ర ఏర్పడ్డాక మారిన ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కార్యకర్తలకు అర్ధమయ్యే విధంగా వివరించారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బాలముకుందం, జెడ్పీటీసి మహేష్, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఏ.ఎమ్.సి ఛైర్మెన్ నక్కల రాధ, మాజీ ఏ.ఎమ్.సి ఛైర్మెన్ లు దామోదర్ రావు, దశరథ రెడ్డి, పాక్స్ ఛైర్మెన్ లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకు జాన్, గంగాధర్, ఎంపీటీసీ ల ఫోరం మహేష్, యూత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, శేఖర్, AMC వైస్ చైర్మన్ అసిఫ్, పాక్స్ వైస్ చైర్మన్ సురేందర్, అర్బన్, రూరల్ మండల రైతు బందు సమితి కన్వీనర్ లు జంబర్తీ శంకర్, నక్కల రవీందర్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు రౌతు గంగాధర్, సర్పంచులు, ఎంపిటిసి లు, ఉప సర్పంచులు,వివిధ హోదాల్లో ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking