హైదరాబాద్ మార్చ్ 27 ();: స్వాతంత్రం కోసం తన జీవితాన్ని త్యాగం 11 నెలలు జైలు శిక్ష అనుభవించిన స్వతంత్ర సమరయోధుడు కోవూరిమొగులయ్య గౌడ్ గారికి కేటాయించిన 10 పది ఎకరాల భూమి పట్టా సర్టిఫికెట్లు , పాస్ బుక్కులు కబ్జా ఇప్పించడంలో సంగారెడ్డి జిల్లాకలెక్టర్ కార్యాలయం నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యానగర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో స్వతంత్ర సమరయోధుడి సమస్య పరిష్కారానికై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నఆయన మాట్లాడుతూ ఇట్టి విషయంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ గారు నిర్లక్ష్య ధోరణి వహించడం సమంజసం కాదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖండిస్తోంది.అదేవిధంగా జిల్లా కలెక్టర్ శరత్ స్వతంత్ర సమర యోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ పది ఎకరాల భూ సమస్యను పరిష్కరించడం పట్ల తన విధి విధానాలు తెలియకుండా మొండి వైఖరితో వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మండిపడ్డారు. స్వతంత్ర సమరయోధుడి పట్ల నిర్లక్ష్య ధోరణితో సంగారెడ్డిజిల్లాకలెక్టర్ శరత్ వహరించే పనితీరు జాతీయస్థాయిలో బి.ఆర్.ఎస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుందని తెలియజేశారు. ఈ యొక్క సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, నందగోపాల్,రాజ్ కుమార్, రక్షక్ దళ్ చైర్మన్ ఉదయ్ కుమార్ నేత, నరేష్ గౌడ్ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.