పోరాట పటిమ తో ముందుకు సాగాలి

బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్-
ఖమ్మం మార్చ్ 27 ; యావత్ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమం కోసం సుమారు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మరి ఏదైతే ఆనాడు నీళ్లు నిధులు నియామకాలు అంటూ పెద్ద ఎత్తున జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు నిరుద్యోగులు పాత్ర క్రియాశీలకమని వారన్నారు. సోమవారం నాడు స్థానిక ఖమ్మం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ గుండు హరికిషోర్ గౌడ్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొడేపల్లి కృష్ణమాచారి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 8 సంవత్సరాల అనంతరం ఏసినటువంటి ఒకే ఒక్క నోటిఫికేషన్ కూడా పేపర్ లీకేజ్ తో విద్యార్థుల యొక్క పరిస్థితి అంధకారంలోకి పోయిందని వారు తెలిపారు.టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనప్పటికీ వారిని కఠినంగా శిక్షించాలని నష్టపోయిన ప్రతి విద్యార్థికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేశారు. చేగువేరా చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న గౌడ్ ఎంతోమంది మహనీయుల యొక్క స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు రావాలని విద్యార్థులకు అండగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారితో పాటుగా మేమంతా అండగా ఉంటామని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి పంతంగి వెంకటేశ్వరరావు,జిల్లా కార్యదర్శి గుడిద రామకృష్ణ,బీసీ యువజన సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బెజవాడ సాయి శేషు,సత్తుపల్లి మండల అధ్యక్షుడు పమర్తి నాగేశ్వరరావు గౌడ్,సత్తుపల్లి టౌన్ అధ్యక్షుడు చిల్లపల్లి మాధవరావు,నాయకులు కందిమల్ల సత్యం,వంశీకృష్ణ,సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking