జిల్లాలో అట్రాసిటీ కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్,

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 29:
జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి వాటిని తక్షణమే పరిష్కరించి బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్రెడ్డి, మేడ్చల్ డీసీపీ నిఖిత్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, రాచకొండ, సైబరాబాద్ పోలీసు అధికారులు కమిటీ సభ్యులు తదితరులతో కలిసి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే పౌరహక్కుల రక్షణ చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్) – పీసీఆర్), అట్రాసిటీ నివారణ చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ – పీవోఏ) చట్టాలను ఖచ్చితంగా అమయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించారు.జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ కేసులకు సంబంధించి రాచకొండ, సైబరాబాద్ పోలీస్ అధికారులు తమతమ పరిధిలో ఇప్పటి వరకు ఉన్న కేసుల వివరాలు వాటి పురోగతిపై కలెక్టర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకొన్నారు. ఈ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏమాత్రం పెండింగ్లో ఉంచరాదని ఆయన సూచించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వివరించారు. ఈ కేసులపై విచారణ చర్యలను వేగవంతం చేసి సకాలంలో బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీంతో పాటు అధికారులు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు అయిన వెంటనే విచారణ దశలో ఉన్న బాధితులకు నిబంధనల మేరకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్కు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సభ్యులను ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. అట్రాసిటీ కేసుల్లో అధికారులు పూర్తి నిబద్దతతో తమ విధులు నిర్వర్తించాలని కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ… అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులు చూడాలని అందుకు సంబంధించి కేసులు పెండింగ్ ఉండకుండా త్వరితగతిన పూర్తయ్యేలా చూడాల్సిందిగా సమావేశంలో పేర్కొన్నారు. కేసులు పెట్టిన వారిపై రకరకాల ఒత్తిడులు వస్తుంటాయని దీనిని దృష్టిలో పెట్టుకొని వారికి పోలీసులు, ఇతర శాఖలు అండగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో కేసులు నమోదైన వెంటనే త్వరితగతిన దర్యాప్తు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీపీ నిఖితపంత్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, రాచకొండ, సైబరాబాద్ పోలీసు అధికారులు, జిల్లా ఏస్సి,ఏస్టి కమీటీ మెంబర్లు వెంకటేష్, ధనరాజ్ నాయక్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అభివృద్ది అధికారి వినోద్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking