మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 29:
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ,లా ఆఫీసర్ చంద్రావతి , తో 129 అర్జీలను కలిసి స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.