మణికొండలో ప్రజానిధుల దుర్వినియోగ ప్రయత్నం

రాజేంద్ర నగర్ శాసనసభ పరిధి ప్రజా బలం ప్రతినిధి 24 జనవరి 2025
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని సెక్రటేరియట్ కాలనీ రోడ్డు లోని డివైడర్ (మీడియన్) లో ఆనందా హోమ్స్ వారి యొక్క అడ్వర్టైజ్ మెంట్ బోర్డులతో పాటు మొక్కల నిర్వహణ కాంట్రాక్టు కూడా పొంది ఉన్నారని మునిసిపల్ అధికారులు తెలిపిన దరిమిలా అట్టి నిర్వహణ కూడా సరిగా చేయడం లేదని గతంలో మునిసిపల్ అధికారుల దృష్టికి తేవడం జరిగినది, ఈ విషయమై మొక్కల నిర్వహణ నేడు మునిసిపల్ సిబ్బంది చేయడం వలన మణికొండలో ప్రజానిధుల దుర్వినియోగ ప్రయత్నంలో భాగంగా ఏ లెక్కన ఇట్టి పనులు చేస్తున్నారో వివరముగా ప్రజలకు స్పష్టంగా తెలియ పరచాలసిన బాధ్యత మునిసిపల్ అధికారులు పైన ఉన్నదని, ఇట్టి పని చేయడానికి కాంట్రాక్టు ఉన్ననూ మళ్ళీ తిరిగి బిల్లులు వసులు చేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నవా అని సందేహం వక్త పరస్తున్న భారత రాష్ట్ర సమితి మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ప్రజల తరఫున డిమాండ్ చేయడం, ఈ విషయంలో స వివరముగా ప్రజలకు తెలియ చేయమని పత్రికా ముఖంగా అధికారులను అడుగడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking