అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయి

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

ప్రజాబల ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 24:
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నాం అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తో పాటు రైతు భరోసా ప్రతి రైతుకు సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు అందిస్తామని, రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారికి ప్రతి ఇల్లు లేని స్థలమున్న, స్థలం లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అందించేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని శామీర్ పేట మండల కేంద్రంలో ప్రజా పాలన గ్రామసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం శామీర్ పేట లోని గ్రామసభలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 26 నుండి ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, భూమిలేని రైతులకు నెలకు ₹1000 ఆర్థిక సాయం లాంటి ఆరు గ్యారంటీల్లో మిగిలిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలుపరుస్తుందన్నారు. మేడ్చల్ జిల్లాలో 4,104 మంది రైతులకు 28 కోట్ల రుణమాఫీ జరిగింది. ఘట్కేసర్, పూడూరు, దుండిగల్ సహకార సంఘాల ఆడిట్ నేపథ్యంలోని ఇబ్బందులతో త్వరలో మరో 2 వేల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని, శామీర్ పేట మండలంలో 550 మంది రైతులకు 4 కోట్ల రుణమాఫీ జరిగిందని, శామీర్ పేట గ్రామంలో 117 మంది రైతులకు 78 లక్షల రుణమాఫీ జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నాం అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తో పాటు రైతు భరోసా ప్రతి రైతుకు సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఎంపిడిఒ మమతా బాయి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking